TG TET Schedule: తెలంగాణ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ షెడ్యూల్ విడుదలైంది. జనవరి 2 నుంచి 20 వరకూ వివిద సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. సంక్రాంతి నాలుగు రోజులు ఎలాంటి పరీక్షలుండవు. మొత్తం 20 సెషన్లలో జిల్లాలవారీగా ఈ పరీక్షలు జరగనున్నాయి. ఏ పరీక్ష ఎప్పుడో చెక్ చేద్దాం.
తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఏడాది నవంబర్ 20 వరకూ ఇందుకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ పూర్తి కాగా జనవరి 2 నుంచి 20 వరకూ మొత్తం 20 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణ టెట్ పరీక్షకు మొత్తం 2 లక్షల 75 వేల 773 దరఖాస్తులు చేరాయి ఇందులో పేపర్ 1 పరీక్షలు 94, 335 మంది దరఖాస్తు చేసుకోగా, పేపర్ 2 కోసం 1 లక్షా 81 వేల 438 మంది అప్లై చేశారు. మొత్తం పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో రోజుకు రెండు సెషన్లలో జరగనుంది. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకూ ఒక సెషన్, మద్యాహ్నం 2 గంటల్నించి సాయంత్రం 4.30 గంటల వరకూ మరో సెషన్ ఉంటుంది.
Also read: Toll Plaza: ఏపీలో టోల్ బాదుడు, ఎన్నిసార్లు దాటితే అన్నిసార్లు కట్టాల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.