అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సతీమణి మెలానియా ట్రంప్, కూతురు ఇవాంకా ట్రంప్, అల్లుడు జెరెడ్ కుష్నర్లతో కలిసి ఇటీవల భారత్‌లో పర్యటించారు. అయితే ఇవాంకా ట్రంప్‌పై నెటిజన్లు మనసు పారేసుకుంటున్నారు. పాలనలో సలహాలు ఇవ్వడంలో దిట్ట అయిన ఇవాంక అందంతోనూ అభిమానులను సంపాదించుకున్నారు. ఇవాంక అమెరికాకు వెళ్లగానే తన ఫొటోషాప్ నైపుణ్యానికి పదునుపెట్టారు. బాలీవుడ్ నటుడు, ప్లే బ్యాక్ సింగర్ దిల్జిత్ దోసాన్జ్ సైతం ఇవాంకతో దిగినట్లుగా ఉన్న ఫొటోను షేర్ చేశాడంటే ఆమెకున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
See Pics: ఆ ఫొటోలపై ఇవాంక ట్రంప్ ఏమన్నారో తెలుసా?
తన ఫొటోలపై హుందాగా స్పందించిన ఇవాంక.. భారత్‌లో తనకు కొత్త మిత్రులు దొరికారని, మీరు చూపిస్తున్న ప్రేమకు ముగ్దురాలని అవుతున్నానని ఆమె ఆ ఫొటో పోస్టులకు రీట్వీట్ చేయడం విశేషం. తాము చేతులు వేసినట్లుగా తయారుచేసిన ఫొటోలపై సైతం తనకు స్నేహితులు దొరికారంటూ ఇవాంక హుందాగా స్పందించడాన్ని మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రశంసించారు. మీ గొప్పతనాన్ని, సెన్సాఫ్ హ్యూమర్‌ని ఈ ట్వీట్ చెబుతుందని ఇవాంక ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. నా మాతృభూమి తరఫున మీకు దక్కిన ప్రేమ, గౌరవం ఇలాంటివి. ధన్యవాదాలు అని తేజ్ ట్వీట్ చేశారు.
See Photos: అక్కాచెల్లెళ్లు కాదు.. తల్లీకూతుళ్లు!
This tweet shows your grace and super sense of humour... #respect and #love from my motherland...thank you 🙏🏼 https://t.co/T5gmMaQvU0
— Sai Dharam Tej (@IamSaiDharamTej) March 1, 2020
సాయిధరమ్ తేజ్ ట్వీట్‌కు మిశ్రమ స్పందన లభిస్తోంది. అక్కడేమో సోలో బతుకే సో బెటర్ అంటాడు.. ఇక్కడేమో పులిహోర కలిపేస్తున్నాడంటూ కొందరు నెటిజన్లు స్పందిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 26వ సినిమా గ్యాప్ తర్వాత తీస్తున్న మూవీ కావడంతో దీనిపై పోస్ట్ చేయవచ్చుకదా తేజ్‌ను అడుగుతున్నారు. తమ హీరో సినిమా మీద కామెంట్ చేయకుండా ఇలా ట్వీట్ చేశాడనేమో గానీ.. ఇలాంటి పులిహోర నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అని మరికొందరు సాయిధరమ్ తేజ్‌ను ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇలాంటి మంచి విషయాలపై ట్రోల్ చేయడం పద్ధతికాదని మరికొందరు తేజ్‌కు మద్దతు తెలుపుతున్నారు.
Also Read: తనకంటే 37 ఏళ్లు పెద్ద వ్యక్తితో నటి రిలేషన్