అమరావతి: జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్)లో ప్రతిపాదించబడ్డ వివాదాస్పద ప్రశ్నలను మినహాయించాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు. ఏప్రిల్ 1న ప్రారంభమయ్యే ఈ ప్రక్రియపై రాష్ట్ర మైనారిటీలలో అభద్రతకు కారణమవుతోందని, తాము దీన్ని స్వాగతించలేమని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా, పార్టీ అంతర్గతంగా విస్తృతమైన సంప్రదింపుల తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా 2010లో ఉన్నటువంటి నియమ నిబంధనలననుసరించి ఈ ప్రక్రియ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. కాగా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముస్లిం ప్రతినిధి బృందంతో సమావేశం అయ్యారు. వెంటనే ఈ ప్రకటన వెలువడింది. ఈ మేరకు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సీఎం వైఎస్ ట్వీట్ చేశారు.
Some of the questions proposed in the NPR are causing insecurities in the minds of minorities of my state. After elaborate consultations within our party, we have decided to request the Central Government to revert the conditions to those prevailing in 2010. (1/2)
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 3, 2020
కేంద్రం ప్రతిపాదించిన ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా బీహార్ లో ఎన్డీఏ నేతృత్వంలోని నితీష్ ప్రభుత్వం తీర్మానాన్ని ఆమోదించగా, ఇప్పుడు దాని సరసన ఆంధ్రప్రదేశ్ చేరబోతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..