ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇప్పుడు కరోనా వైరస్ గురించే చర్చ జరుగుతోంది. కానీ అప్పట్లో 'కరోనా వైరస్' లాంటి వైరస్ లు ప్రపంచాన్ని గడగడా వణికించాయి. సార్స్, మెర్స్, ఎబోలా ఇలాంటి వైరస్ లు ఉపద్రవాన్ని సృష్టించాయి. అప్పట్లో వందల మంది ఈ వ్యాధుల బారిన పడి చనిపోయారు. ప్రస్తుతం చైనాలో పుట్టిన 'కరోనా వైరస్' ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
'కరోనా వైరస్' ఉద్ధృతంగా ఉన్న ఈ సమయంలో అంతా దాని గురించే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ వైరస్ 81 దేశాల ప్రజలను బిక్కుబిక్కుమని బతికేలా చేస్తోంది. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని జనం నిత్యం భయం గుప్పిట్లో బతుకీడుస్తున్నారు. ఇంకా చెప్పాలంటే .. ముక్కుకు మాస్క్ లు బిగ కట్టుకుని భారంగా శ్వాస తీసుకుంటున్నారు. ఇలాంటి ఈ సమయంలో చీకట్లో కాంతి పుంజంలా ఓ చల్లని వార్త వినిపించింది. ఒకప్పుడు ఆఫ్రికన్ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేసిన ఎబోలా వైరస్ పూర్తిగా నాశనమైపోయింది. ఇప్పుడు దాని ఉనికి కనిపించడం లేదు.
Read Also: 'కరోనా వైరస్'పై ఫన్నీ వీడియోలు
కాంగోలో చివరి రోగిని ఇవాళ (గురువారం) విడుదల చేశారు. దీంతో అక్కడి ఆస్పత్రిలోని వైద్య ఆరోగ్య సిబ్బంది సంబరాలు చేసుకున్నారు. డప్పులు కొడుతూ ఆస్పత్రి బయట నృత్యం చేశారు. ఇంకా చెప్పాలంటే.. రోగి కంటే ఎక్కువగా ఆనందించారు.
RELAY VIRUS ? 🤔
As WORLD fights CARONA/COVID19 the other deadly virus EBOLA is hopefully exiting!!
Health workers in Congo celebrate discharge of last Ebola patient & a 42-day countdown has begun to declare end of the world's 2nd deadliest virus Ebola.pic.twitter.com/U8cqdP1xCH— ѕαtчα n prαdhαn सत्यनारायण प्रधान, DG NDRF (@satyaprad1) March 5, 2020
మరోవైపు ఎబోలా వైరస్ ఉనికికి సంబంధించి పూర్తి అధికారికంగా ప్రకటించే ఇంకా సమయం పడుతుంది. అందుకోసం నేటి నుంచి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 42 రోజులపాటు కౌంట్ డౌన్ పూర్తయిన తర్వాత ఎబోలా వైరస్ ఉనికిపై అధికారికంగా ప్రకటించనున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
ఈ వైరస్ వచ్చింది.. ఆ వైరస్ పోయింది..!!