French Bulldog Vs Kodipunju Viral Video Watch Now: తెలుగు పండగల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండగ సంక్రాంతి.. ఈ పండగను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే సంక్రాంతి పండ అంటే అందరకీ గుర్తుకు వచ్చేది.. ముగ్గులు, కోడి పందాలు.. ఆంధ్రాలోని కొన్ని జిల్లాల్లో పండగకు ముందే కోడి పందాలు ప్రారంభమై సంక్రాంతి పండగకు మంచి ఊపందిస్తాయి. మనం చాలా వరకు కోడి పందాలను సోషల్ మీడియాలో వీడియోల రూపంలో వైరల్ అవుతున్న చూస్తూ ఉంటాం. కానీ సంక్రాంతి పండగకు ముందే సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.
సంక్రాంతికి ముందు కోడి పందాలు, కోళ్లకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటే.. ప్రస్తుతం ఓ కోడికి సంబంధించిన వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ వీడియోలో కోడి పుంజు ఏం చేసింది. వీడియో వైరల్ అవ్వడానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. అయితే ఈ వీడియో వివరాల్లోకి వెళితే.. కోడి పుంజు, ఓ కుక్కతో సై అంటే సై అంటూ పోటా పోటీగా తలపడుతోంది. దీనికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
#Todayviralvideo #RishabhPant pic.twitter.com/rdk6YKVtlf
— TodayHoroscope TodayHoroscope (@TTodayhoro30767) January 4, 2025
ఈ వీడియో ఓ ఫ్రెంచ్ బుల్ డాగ్ ఓ స్థంబానికి కట్టి ఉండడం మీరు గమనించవచ్చు. అయితే దీని పక్కనే ఓ కోడి పుంజు కూడా కట్టేసి ఉండడం చూడవచ్చు. అయితే ఆ కుక్క ముందుగా కోడి పుంజుపై దాడి చేస్తుంది. ఇవి రెండు చివరి నిమిషం వరకు పోటపోటీగా ఫైట్ చేస్కుంటూ ఉంటాయి. చివరగా కోడి పుంజు ఫ్రెంచ్ డాగ్‌కి చెమటలు పట్టించింది. ఈ ఘటన చూసిన చూసి నెటిజన్స్ పడిపడి నవ్వుతున్నారు. అంత పెద్ద కుక్కు కోడి చేతిలో ఓడిపోవడం ఏంటని అంటున్నారు.
ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగిన సమాచారం.. వేంసూరులో ఓ చిన్న రైతు కుక్కతో పాటు కోడి పుంజును పెంచుకుంటున్నారు. అయితే కోడి పుంజుకు ఫైటింగ్‌లో ప్రావీణ్యం ఉండడంతో కుక్కతో ఏ మాత్రం భయపడకుండా పోటీకి దిగి గెలిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో X లో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్ వారి అభిప్రాయాలను కామెంట్లు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి :: King Cobra Shed Video: 5 అడుగుల కింగ్ కోబ్రా కుబుసాన్ని తొలిచేసిన యువకుడు.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.