Pushpa 2 The Rule: రామ్‌చరణ్‌, బాలయ్యకు భారీ షాక్‌.. సడన్‌ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్‌

Pushpa 2 The Rule Reloaded Version With 20 Minutes From 11th January: సంక్రాంతి బరిలో ఉన్న రామ్‌చరణ్‌, బాలకృష్ణ, వెంకటేశ్‌లకు భారీ షాక్‌ తగిలింది. పండుగకు అదనపు సన్నివేశాలతో పుష్ప 2 ది రూల్‌ రాబోతుండడంతో ఆ మూడు సినిమాలకు భయం పట్టుకుంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 7, 2025, 07:59 PM IST
Pushpa 2 The Rule: రామ్‌చరణ్‌, బాలయ్యకు భారీ షాక్‌.. సడన్‌ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్‌

Pushpa 2 The Rule Reloaded Version: సంక్రాంతి పండుగకు భారీ స్థాయిలో సినిమాలు విడుదల అవుతున్న వేళ అకస్మాత్తుగా అల్లు అర్జున్‌ ఎంట్రీ ఇచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా భారీ హిట్‌ సొంతం చేసుకున్న పుష్ప 2 ది రూల్‌ సినిమాను మరింత కొత్తగా విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అదనంగా 20 నిమిషాల సన్నివేశాలు జోడిస్తూ సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు సినిమా నిర్మాణ సంస్థ వెల్లడించింది. అకస్మాత్తుగా పుష్ప 2 ఎంట్రీ ఇవ్వడంతో గేమ్‌ ఛేంజర్‌, డాకు మహారాజ్‌, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలకు భారీ షాక్‌ తగిలింది.

Also Read: Rajinikanth: కంట్రోల్‌ తప్పిన సూపర్ స్టార్ రజనీకాంత్.. ఎయిర్‌పోర్టులో మీడియాపై చిందులు

సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా జంటగా నటించిన 'పుష్ప 2: ది రూల్‌' సినిమా డిసెంబర్‌ 5వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రీమియర్‌ షో నుంచి నేటి వరకు పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా దుమ్ముధుళిపేస్తోంది. 3 గంటల 15 నిమిషాల సినిమా కలెక్షన్లతోపాటు రికార్డులు కొల్లగొడుతూ ప్రపంచ ప్రేక్షకుల మెప్పు పొందుతోంది. ఈ క్రమంలో కొన్ని జరిగిన సంఘటనలతో ఈ సినిమాకు మరింత క్రేజ్‌ తీసుకువచ్చింది.

Also Read: Vishal Health: తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో ప్రముఖ హీరో విశాల్‌.. అసలు ఏం జరిగింది?

అదనంగా 20 నిమిషాల సన్నివేశాలు
సంక్రాంతి సందర్భంగా పుష్ప టీమ్‌ ప్రేక్షకుల అదిరిపోయే వార్త వినిపించింది. రీలోడెడ్‌తో మళ్లీ థియేటర్‌లలోకి వస్తున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రకటించింది. సినిమాలో అదనంగా 20 నిమిషాల సరికొత్త సన్నివేశాలు జోడిస్తున్నట్లు వెల్లడించింది. ఈనెల 11వ తేదీన అదనపు సన్నివేశాలతో విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ సన్నివేశాల జోడింపుతో సినిమా నిడివి 3 గంటల 45 నిమిషాలకు పెరగడం గమనార్హం. మరి కొత్త సన్నివేశాలు ఎలా ఉంటాయోనని ప్రేక్షకులు, బన్నీ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సన్నివేశాల జోడింపుతో మరోసారి పుష్ప 2 చూసేందుకు ప్రేక్షకులు సిద్ధమవుతున్నారు.

ఆ చిత్రాలకు షాక్‌
కాగా సంక్రాంతి సినిమాకు రామ్‌చరణ్‌, బాలకృష్ణ, వెంకటేశ్‌ వస్తున్న విషయం తెలిసిందే. ఈ ముగ్గురు తమ సినిమాలతో సందడి చేసేందుకు వస్తుండగా అకస్మాత్తుగా పుష్ప 2 చిత్రబృందం ప్రకటించిన వార్త వారికి షాక్‌కు గురి చేసింది. అదనపు సన్నివేశాలతో విడుదలవుతున్న పుష్ప 2కు ప్రేక్షకులు తరలివెళ్తారనే భయం ఆ మూడు సినిమాల బృందానికి ఏర్పడింది. ముగ్గురు మధ్య తీవ్ర పోటీ నెలకొన్న పరిస్థితుల్లో పుష్ప 2 రావడంతో సినీ పరిశ్రమలో ఆసక్తికర పోటీ నెలకొంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News