భారత్‌కి చెందిన ఏడేళ్ల బాలుడికి దుబాయ్‌లో 1 మిలియన్ డాలర్ల లాటరీ తగిలింది. దీంతో రాత్రికి రాత్రే ఏడేళ్ల బాలుడు రిచెస్ట్ బాయ్స్ జాబితాలో ఒకరిగా చోటు సంపాదించుకున్నాడు. తమిళనాడుకి చెందిన కనకరాజ్ కుటుంబం 27 ఏళ్లుగా దుబాయ్‌లోని అజ్మన్‌లో నివాసం ఉంటోంది. అక్కడే ఫర్నిచర్ వ్యాపారం చేసుకుంటున్న కనకరాజ్ తన ఏడేళ్ల కుమారుడు కపిల్‌రాజ్ కనకరాజ్ పేరుపై దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీలో ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. 327 సిరీస్‌లో 4234 నెంబర్ గల ఈ టికెట్ తన తలరాత మారుస్తుందని అప్పుడు కనకరాజ్ అనుకోలేకపోయాడు. కానీ ఆ టికెటే కపిల్‌రాజ్ కనకరాజ్‌కి 1 మిలియన్ డాలర్ల లాటరీని తెచ్చిపెట్టింది.
గెలిచిన లాటరీ డబ్బుతో తన ఫర్నిచర్ వ్యాపారం అభివృద్ధి చేస్తానని.. అలాగే తన కొడుకు కపిల్‌రాజ్ భవిష్యత్ కోసం వెచ్చిస్తానని కనకరాజ్ చెప్పుకొచ్చాడు. తనను అదృష్టం ఇలా వరిస్తుందని ఎప్పుడూ అనుకోనేలేదని.. అందుకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని కనకరాజ్ చెప్పుకొచ్చాడు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.