నిర్భయ కేసులో (Nirbhaya case) దోషులుగా ఉన్న ముఖేష్ సింగ్, అక్షయ్ కుమార్, పవన్ గుప్త, వినయ్ శర్మ (Nirbhaya case convicts)లను ఉరితీసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ ద్వారా ఈ అంశంపై స్పందించారు. న్యాయం జరిగిందని.. మహిళలకు రక్షణ, తగిన గౌరవం, సమాజంలో సముచిత స్థానం కల్పించడం ఎంతో అవసరమని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారని.. మహిళా సాధికారత కోసం, సమానత్వం అందరం కలిసి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని ట్విటర్ ద్వారా పిలుపునిచ్చారు.
Justice has prevailed.
It is of utmost importance to ensure dignity and safety of women.
Our Nari Shakti has excelled in every field. Together, we have to build a nation where the focus is on women empowerment, where there is emphasis on equality and opportunity.
— Narendra Modi (@narendramodi) March 20, 2020
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు దోషులకు ఢిల్లీలోని తీహార్ జైలులో శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటలకు ఉరి శిక్ష విధించిన నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఈ ట్వీట్ చేశారు. నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలు చేయడంతో ఇప్పటివరకు ఏడేళ్లుగా సాగిన అనేక నాటకీయ పరిణామాలకు తెరపడినట్టయింది. ముఖ్యంగా గత రెండున్నర నెలల్లో మూడుసార్లు దోషులకు ఉరిశిక్ష వాయిదా పడటంతో అసలు వారిని ఉరితీస్తారా లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆ సందేహాలన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ కేంద్రం వారికి ఉరిశిక్ష అమలు చేసింది. నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష అమలు అనంతరం దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..