Plasma collection: కోలుకున్న వాళ్ల ప్లాస్మాను సేకరించి కరోనా పాజిటివ్ రోగులకు ఎక్కించే వైద్యం

కరోనా వైరస్ నుండి పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులైన వారి రక్తంలోంచి ప్లాస్మాలను సేకరించి (collecting plasma).. ఆ ప్లాస్మాను కొత్తగా వైరస్ సోకిన రోగికి ఎక్కించడం (Injecting plasma) ద్వారా కరోనా వైరస్ పాజిటివ్ పేషెంట్స్‌కి వ్యాధిని నయం చేయొచ్చని అమెరికా భావిస్తోంది.

Last Updated : Apr 2, 2020, 07:09 PM IST
Plasma collection: కోలుకున్న వాళ్ల ప్లాస్మాను సేకరించి కరోనా పాజిటివ్ రోగులకు ఎక్కించే వైద్యం

న్యూయార్క్ : కరోనావైరస్ పుట్టిన చైనా కంటే.. అమెరికాలోనే దాని ప్రభావం ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. అందుకే కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు అమెరికా మరోసారి పాత పద్ధతినే అవలంభించేందుకు సిద్ధమవుతోంది. కరోనా వైరస్ నుండి పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులైన వారి రక్తంలోంచి ప్లాస్మాలను సేకరించి.. ఆ ప్లాస్మాను కొత్తగా వైరస్ సోకిన రోగికి ఎక్కించడం ద్వారా కరోనా వైరస్ పాజిటివ్ పేషెంట్స్‌కి వ్యాధిని నయం చేయొచ్చని అమెరికా భావిస్తోంది. ఇలా ప్లాస్మాను సేకరించి మరో పేషెంట్‌కి ఇంజెక్ట్ చేసే విధానాన్నే కన్‌వల్‌సెంట్ ప్లాస్మా థెరపీ (convalescent plasma therapy) అని పిలుస్తారు. గతంలో ఒక వైరస్ బారిన పడి కోలుకున్న వారి నుంచి సేకరించిన ప్లాస్మాను కొత్తగా వైరస్ సోకిన మరొకరికి ఇంజెక్ట్ చేయడం ద్వారా ఆ వ్యాధిని నయం చేయొచ్చని గతంలోనే పలు సందర్భాల్లో ప్రూవ్ అయింది.

Read also : లాక్‌డౌన్‌ విషయంలో కేంద్రం సోనియా గాంధీ ఫైర్

కన్‌వల్‌సెంట్ ప్లాస్మా థెరపీ ఇదివరకు ఎప్పుడైనా చేశారా ?
కన్‌వల్‌సెంట్ ప్లాస్మా థెరపీ అనగానే ఈ పేరు కొత్తగా ఉంది కదా ఈ తరహా వైద్యం ఎప్పుడైనా చేశారా అనే సందేహం రావొచ్చేమో. అయితే, ఇదేమీ కొత్త వైద్యం కాదు. తొలిసారిగా 2018లో ఫ్లూ విజృంభించినప్పుడు ఇదే తరహాలో ఫ్లూక్ చెక్ పెట్టారు. అంటే ఇది 102 ఏళ్ల పాత వైద్యం అన్నమాట. ఆ తర్వాత 1930లోనూ మరోసారి ఈ థెరపీని ప్రయోగించారు. అంతేకాదు.. ఈమధ్య కాలంలో ఎబోలా, సార్స్, H1N1 ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లు దాడి చేసినప్పడు కూడా ఈ కన్‌వల్‌సెంట్ ప్లాస్మా థెరపీనే ప్రయోగించారు. 

Read also : ఏప్రిల్ 15 నుంచి టికెట్ల రిజర్వేషన్లపై రైల్వే శాఖ క్లారిటీ

అందుకే ఈసారి కూడా కరోనావైరస్ రెచ్చిపోతున్న నేపథ్యంలో అమెరికాలో ఎక్కడికక్కడ ఉన్న స్థానిక బ్లడ్ డొనేషన్ సెంటర్స్‌లో ఈ ప్లాస్మాలను సేకరించి కరోనా వైరస్ పాజిటివ్ వారికి ఎక్కించాలని అమెరికా భావిస్తున్నట్టు తెలుస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News