లావుగా ఉన్నావు అని సరదాగా ఆటపట్టిస్తుంటారు. అయితే ఇలాంటివారిలో పెద్ద తొడలు కలిగి ఉన్నవారికి ఓ శుభవార్త. ఈ వ్యక్తులకు బీపీ తక్కువ ఉండటంతో పాటు గుండె సంబంధిత జబ్బులు వచ్చే అవకాశాలు ఇతరులతో పోల్చితే చాలా తక్కువ అని తాజా అధ్యయనంలో తేలింది. ఎండోక్రైన్ కనెక్షన్ అనే జర్నల్‌లో ఈ వివరాలు పొందుపరిచారు. ప్రపంచ వ్యాప్తంగా హై బీపీ సమస్యలతో 100 కోట్ల మంది సతమతమవుతున్నారట. మరణాలు మరియు వైకల్యానికి, గుండె సంబంధిత జబ్బులకు అధిక రక్తపోటు ప్రధాన కారణం అవుతోంది. ఉప్పు.. ఆరోగ్యానికి పెద్ద ముప్పు!
చైనాలోకి షాంఘై జియావో టాంగ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ జెన్ యాంగ్ ఈ రీసెర్చ్‌లో పాల్గొన్నారు. 40 ఏళ్లు పైబడిన వారిలో అధిక బరువు (స్థూలకాయులు) ఉన్న 9,250 పురుషులు, స్త్రీలు.. సాధారణ బరువుతో ఉన్న 4,172 మంది పురుషులు, స్త్రీలపై ఈ అధ్యయనం చేశారు. NAP: మధ్యాహ్నం నిద్ర లాభమా.. నష్టమా? ఏం చేస్తే బెటర్
తొడల పరిమాణం పెద్దగా ఉండే వారిలో.... తొడ చుట్టుకొలత పురుషులలో 55 సెం.మీ కంటే ఎక్కువ, మహిళల్లో 54 సెం.మీ. కన్నా ఎక్కువగా ఉన్న వారిలో వయసుతో సంబంధం లేకుండా రక్తపోటు (బీపీ) స్థిరంగా ఉందని దీని వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువని జర్నల్‌లో పేర్కొన్నారు. కానీ తొడ చుట్టుకొలత తక్కువగా (మహిళలకు 50 సెం.మీ కంటే తక్కువ మరియు పురుషులకు 51 సెం.మీ) ఉన్నవారిలో రక్తపోటు పెరిగే అవకాశం ఉందని అధ్యయనంలో గుర్తించారు. రాత్రికి కరోనా ఖతమ్.. Corona ఫన్నీ మీమ్స్
పొట్ట (ఉదరం)లోని కొవ్వుకు భిన్నంగా, కాళ్లు, చేతుల్లోని కొవ్వు జీవక్రియకు ఉపయోగపడుతుంది. రక్తపోటును నియంత్రించే పదార్థాలను ఆ కొవ్వులు స్రవించి అధిక రక్తపోటు రాకుండా దోహం చేస్తాయని డాక్టర్ యాంగ్ వివరించారు. ఊబకాయం లేక అధిక బరువు ఉన్నవారిలో అధిక రక్తపోటు మరియు గుండె జబ్బులను తొడ బరువు, చుట్టుకొలత సాయంతో తేలికగా అంచనా వేయవచ్చునని రీసెర్చ్‌లో తేలింది. ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos
గత ఫలితాల ఆధారంగా దీనిపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు సిద్ధమైనట్లు వెల్లడించారు. తొడ కొవ్వు పరిమాణం, తొడ కండరాల బరువు, తొడ ఎముక బరువు, అక్కడ ఉండే ప్రోటీన్ల ఆధారంగా వీటికి రక్తపోటుకు సంబంధం ఉందా అనే కోణంలో రీసెర్చ్ చేయనున్నట్లు యాంగ్ వివరించారు. ఈ ఫలితాలు భవిష్యత్‌లో వైద్య చికిత్సకు బాటలు వేస్తాయని ఆకాంక్షించారు. Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ