హోమ్ మేడ్ మాస్క్ తయారు చేయడం ఎలా..?

'కరోనా వైరస్ '.. కారణంగా ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. వైరస్ మహమ్మారి 200 దేశాలను ఇబ్బంది పెడుతోంది. కరోనా వైరస్ ఉద్ధృతిని అడ్డుకునేందుకు అన్ని దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. అంతే కాదు సామాజిక దూరం పాటించాలని సూచించాయి.

Last Updated : Apr 19, 2020, 03:06 PM IST
హోమ్ మేడ్ మాస్క్ తయారు చేయడం ఎలా..?

'కరోనా వైరస్ '.. కారణంగా ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. వైరస్ మహమ్మారి 200 దేశాలను ఇబ్బంది పెడుతోంది. కరోనా వైరస్ ఉద్ధృతిని అడ్డుకునేందుకు అన్ని దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. అంతే కాదు సామాజిక దూరం పాటించాలని సూచించాయి. 

మరోవైపు ముక్కుకు అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని వైద్యులు చెబుతున్నారు.  ఫలితంగా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చంటున్నారు. దీంతో మాస్కులకు గిరాకీ బాగా  పెరిగింది.  కంపెనీలు తయారు  చేసిన మాస్కులన్నీ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. కొత్త మాస్కులు తయారు చేస్తున్నా.. డిమాండ్ కు తగిన సరఫరా ఉండడం లేదు. 

మరోవైపు హోమ్ మేడ్ మాస్కులు .. అంటే ఇంట్లో తయారు చేసిన మాస్కులు వాడుకోవడం వల్ల వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని చెబుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది ఇళ్లల్లోనే మాస్కులు తయారు చేస్తున్నారు. ఐతే ఒక్కొక్కరిది ఒక్కో శైలిగా ఉంది. ఇందులో నేను సైతం అంటూ ముందుకొచ్చింది బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్. తనదైన శైలిలో హోమ్ మేడ్ మాస్క్ తయారు చేసి చూపించింది.

బ్లౌజ్ పీస్‌తో మాస్క్ తయారు  చేయడం ఎలా..? అని తయారు చేసి చూపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె ట్విట్టర్‌లో షేర్ చేసింది. కాబట్టి ఆ విధంగా మాస్క్ తయారు చేసుకుని అందరూ సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News