పాక్ గుండెల్లో వణుకు..!!

పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎప్పుడెప్పుడు భారత్ దాడికి దిగుతుందేమోనన్న అనుమానాలు దాయాది దేశానికి  కంటి మీద  కునుకు లేకుండా చేస్తున్నాయి. అనుక్షణం భయంతో బతుకీడుస్తోంది నిత్యం కుట్రలు చేసే పాకిస్తాన్. 

Last Updated : May 10, 2020, 04:23 PM IST
పాక్ గుండెల్లో వణుకు..!!

పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎప్పుడెప్పుడు భారత్ దాడికి దిగుతుందేమోనన్న అనుమానాలు దాయాది దేశానికి  కంటి మీద  కునుకు లేకుండా చేస్తున్నాయి. అనుక్షణం భయంతో బతుకీడుస్తోంది నిత్యం కుట్రలు చేసే పాకిస్తాన్. 

అవును... హంద్వారా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ సైన్యం తీరు పూర్తిగా మారిపోయింది. భారత ఆర్మీ దళాలు ఎప్పుడు బదులు తీర్చుకుంటాయోనన్న అనుమానం వేధిస్తోంది. దీంతో పాక్ ఉపరితలంపై వైమానిక నిఘా పెంచింది. నిత్యం యుద్ధ విమానాలు పాక్ గగనతలంపై గస్తీ తిరుగుతున్నాయి. అందులో ఎఫ్- 16, జేఎఫ్-17 సహా ఇతర యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి. నిజానికి భారత సరిహద్దుల్లో యుద్ధ విమానాలు తిరగడం కొత్తేమీ కాదు. కానీ హంద్వారా ఘటన తర్వాత భారత్ బదులు తీర్చుకుంటుందన్న భయంతో పాకిస్తాన్ విమానాల సంఖ్య పెరిగింది. 

గత కొన్నేళ్లుగా చూస్తే.. భారత్ పై ఉగ్రదాడులు  జరిగిన తర్వాత కొద్ది రోజులపై భారత ఆర్మీ దళాలు బదులు తీర్చుకున్న ఘటనలు ఉన్నాయి. 2016 ఉరి దాడి తర్వాత కావచ్చు, 2019 పుల్వామా దాడి తర్వాత కావచ్చు.. భారత సైన్యం దెబ్బకు దెబ్బ తీసింది. అంతే కాదు కొద్ది రోజుల క్రితమే పాక్ ఆక్రమిత  కాశ్మీర్..POK బాలాకోట్ లోని జైష్ ఏ మహ్మద్ స్థావరాలను భారత సైన్యం నాశనం చేసింది. అంతేకాదు కొద్ది రోజుల క్రితమే టాప్ లష్కర్ కమాండర్ రియాజ్ ను కూడా భారత ఆర్మీ దళాలు మట్టుబెట్టాయి. ఐతే హంద్వారా ఘటన ద్వారా భారత ఆర్మీకి చాలా నష్టం జరిగింది. ఐదుగురు ఆర్మీ సిబ్బంది అమరులయ్యారు. 

మరోవైపు హంద్వారా ఘటన వెనుక హిజ్బుల్ ముజాహిదీన్ హస్తం ఉన్నట్లు వెల్లడైంది. ఇందుకు సంబంధించి .. ఆ ఘటనకు తామే బాధ్యత వహిస్తున్నట్లు హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ ఓ వీడియో ద్వారా ప్రకటించారు. ఆ వీడియోను బీజేపీ అధికార ప్రతినిధి ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News