న్యూఢిల్లీ: నకిలీ వాట్సాప్ సందేశం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న సందేశాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కొట్టిపారేసింది. అయితే సీబీఎస్‌ఇ (CBSE) క్లాస్ 10, 12 పరీక్షల డేట్‌షీట్ అంటూ చలామణి చేసిన నకిలీ వార్తలో నిజం లేదంటూ పేర్కొంది. కాగా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నకిలీ వార్తలు సృష్టించడం సరైంది కాదని హితవు పలికింది. అంతేకాకుండా ఈ నకిలీ డేట్‌షీట్ అంశంపై సీబీఎస్‌ఇ 10, 12 వ తరగతి విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలంటతో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రజలను కోరింది.
Also Read: థియేటర్లు బంద్.. నెట్టింట్లో సినిమా..!!
Claim - A whatsapp forward claiming to be Date Sheet of #CBSE Board examination for Class 10th & 12th.#PIBFactCheck: #Fake forwards. Union HRD Minister @DrRPNishank will be releasing the date sheet for the same at 5 pm today.
Check: https://t.co/qCtXp7x2rB pic.twitter.com/7JNxsZTwsK
— PIB Fact Check (@PIBFactCheck) May 16, 2020
పీఐబీ, Press Information Bureau (PIB) ఇదే అంశానికి సంబంధించి తన అధికారిక ట్విట్టర్ (Twitter) హ్యాండిల్‌లో ఫాక్ట్ చెక్‌ను ట్వీట్ చేసింది. సీబీఎస్ఇ బోర్డు పరీక్ష తేదీ షీట్ అని విడుదల చేసిన వాట్సాప్ ఫార్వర్డ్ సందేశాన్ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ అని ట్వీట్ చేసింది. క్లాస్ 10, 12 తరగతులకు ఉన్న నకిలీ వార్తకు సంబందించిన సీబీఎస్ఇ బోర్డు పరీక్ష తేదీ షీట్ చిత్రంపై ఫేక్ అనే పదంతో ఒక స్టాంప్ వేసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కాగా ఇదే అంశానికి సంబంధించి పరీక్షల తేదీలను సీబీఎస్ఇ బోర్డు ఈ రోజు సాయంత్రం 5.00 గంటలకు విడుదల చేయనున్నట్లు కేంద్రమానవ వనరుల శాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ విద్యార్థులకు తెలియజేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..