న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గత రెండు నెలలుగా పైబడి పకడ్బందీగా లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ కరోనా (Covid-19) మహమ్మారి విజృంభణ తగ్గడం లేదు. ఈ క్రమంలో మే 31న ముగియనున్న(Lockdown) లాక్ డౌన్ 4.0 నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ ప్రకటించనున్నారా అనే కోణంలో కేంద్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు కొనసాగిస్తోంది. నీళ్లు తాగడానికి వచ్చే జంతువులను మొసలి ఎలా వేటాడుతుందో చూడండి ?
ఇదిలాఉండగా న్యూస్ ఛానెళ్లలో చర్చల్లో ఎక్కువగా కనిపించే బీజేపీ జాతీయ అధికార ప్రతినిది సంబిత్ పాత్ర. ఇటు సామజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉన్న ఆయన గురువారం పలు ట్వీట్లను పోస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా కోవిడ్ -19 లక్షణాలతో బాధపడుతున్నారని, అయితే ఈ మధ్యాహ్నం గుర్గావ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. గుర్గావ్లోని మేదాంత ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆసుపత్రి వర్గాలు గురువారం తెలిపాయి. ఆసుపత్రిలో చేరిన సంబిత్ పాత్ర్ర కోవిడ్-19 లక్షణాలున్నట్లు మేదాంత ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..