తిరుమల శ్రీవారి పునర్దర్శనం ఇలా..!!

లాక్ డౌన్ 5.0 రేపటి  నుంచి అమలులోకి రానుంది. ఈ క్రమంలో చాలా కార్యకలాపాలకు సడలింపులు ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఆలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర  ప్రార్థనా మందిరాలు కూడా తెరుచుకోనున్నాయి.

Last Updated : May 31, 2020, 01:02 PM IST
తిరుమల శ్రీవారి పునర్దర్శనం ఇలా..!!

లాక్ డౌన్ 5.0 రేపటి  నుంచి అమలులోకి రానుంది. ఈ క్రమంలో చాలా కార్యకలాపాలకు సడలింపులు ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఆలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర  ప్రార్థనా మందిరాలు కూడా తెరుచుకోనున్నాయి.

ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధమైన క్షేత్రం తిరుమల- తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం తలుపులు కూడా తెరుచుకోనున్నాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇందు కోసం  తిరుమల  తిరుపతి దేవస్థానం..TTD సహా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు  చేస్తోంది. 

జూన్  8 నుంచి భక్తులను శ్రీవారి పునర్దర్శనానికి అనుమతి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. ఐతే భక్తకోటి కోసం ముందుగా కొన్ని మార్గదర్శకాలను అందుబాటులోకి తీసుకొస్తారు. 

సాధారణ సమయాల్లో నిత్యం లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. కానీ ఇప్పుడు కరోనా వైరస్ వేగంగా  విస్తరిస్తున్న క్రమంలో.. భక్తుల దర్శనంపై ఆంక్షలు విధించనున్నారు. పరిమిత సంఖ్యలో  మాత్రమే భక్తులను అనుమతించనున్నారు. రోజుకు కేవలం 7 వేల నుంచి 10  వేల మంది  భక్తులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు.  అంటే గంటకు 500  మందికి స్వామివారి దర్శనం అయ్యేలా చర్యలు తీసుకుంటారు. 

అలాగే మొదటగా మూడు రోజులపాటు టీటీడీ ఉద్యోగులు, ఆ తర్వాత 15 రోజులపాటు తిరుమలవాసులకు స్వామి  వారి దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఆ తర్వాత చిత్తూరు జిల్లా వాసులకు .. అనంతరం దర్శన టికెట్లు, టైమ్ స్లాట్లు కేటాయించి సాధారణ భక్తులను అనుమతిస్తారు. అలిపిరి వద్ద నుంచి భక్తులను క్రమపద్ధతిలో అనుమతిస్తారు. అలిపిరి, నడకమార్గంలో పూర్తిగా తనిఖీలు చేసిన తర్వాతే భక్తులను కొండపైకి అనుమతిస్తారు.

భక్తులు విధిగా మాస్కులు  ధరించడం, గ్లౌజులు తొడుక్కోవడం తప్పనిసరి. అలాగే క్యూ లైన్లలో కచ్చితంగా సామాజిక దూరం పాటించాల్సిందే.  దీన్ని పకడ్బందీగా అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని టీటీడీ హెచ్చరించింది.

భక్తులకు దర్శన  టికెట్లు ఆన్ లైన్ లో మాత్రమే అందించనున్నారు. అంతే కాదు వసతి గదుల కేటాయింపు కూడా ఆన్ లైన్ లో జరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News