Russia: రష్యాను పీల్చేస్తున్న పినుజులు.. మరో ముప్పు పొంచి ఉందన్న శాస్త్రవేత్తలు...

 ప్రపంచాన్ని అతలాకుతలం కరోనా మహమ్మారి క్లిష్ట పరిస్థితుల్లో తాజాగా ఈ ప్రపంచానికి కొత్త శత్రువు సవాలు విసురుతోంది. రష్యాలో మనుషుల రక్తాన్ని పీల్చి చంపేసే పినుజులు భీభత్సం సృష్టిస్తున్నాయి.

Last Updated : Jun 4, 2020, 11:12 PM IST
Russia: రష్యాను పీల్చేస్తున్న పినుజులు.. మరో ముప్పు పొంచి ఉందన్న శాస్త్రవేత్తలు...

హైదరాబాద్: ప్రపంచాన్ని అతలాకుతలం కరోనా మహమ్మారి క్లిష్ట పరిస్థితుల్లో తాజాగా ఈ ప్రపంచానికి కొత్త శత్రువు సవాలు విసురుతోంది. రష్యాలో మనుషుల రక్తాన్ని పీల్చి (swarms of blood-sucking ticks) చంపేసే పినుజులు భీభత్సం సృష్టిస్తున్నాయి. సైబీరియాలో క్రాస్నోయార్క్స్ ప్రాంతంలో ఇప్పటికే ఎనిమిదివేలకు పైగా పినుజు కాటు కేసులు నమోదయ్యాయని, వీరిలో రెండు వేలకు పైగా పిల్లలున్నారని, సెల్యులోస్ ప్రాంతంలో సుమారుగా పదిహెడు వేలకు పైగా పినుజులు కట్టు కేసులొచ్చాయని అధికారులు పేర్కొన్నారు. మళ్లీ పుట్టుకొచ్చిన ఎబోలా వైరస్.. మొదలైన మరణాలు

Also Read: Telangana: ఆసుపత్రి నుండి పారిపోయిన కరోనా పేషంట్..

క్రాస్నోయార్క్స్ (Krasnoyarsk) లో ప్రతి చదరపు కిలోమీటరుకు సగటున రెండు వందల పద్నాలుగు పినుజులు ఉన్నాయని, దీని కాటు వల్ల మెదడువాపు వ్యాధి వస్తుందని, పిల్లలలో దీని ప్రభావం ఎక్కువ గా ఉంటుందని వైద్యులు వెల్లడించారు. 2015లో దాదాపు లక్షా యాభైవేలమంది పినుజు కాటు బారిన పది మరణించారని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ లు రోగిపై పనిచేయక పోవచ్చని వైద్యులు భావిస్తున్నారు. చికిత్స చేసే మందుల కొరత నెలకొనడంతో రష్యా ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే కరోనా కేసుల్లో తీవ్ర స్థాయిలో విజృంభణ కొనసాగుతున్నందున రష్యాకు మరో బారి సవాల్ ఎదురైంది. పినుజుల రూపంలో మరో ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News