World Cup 2011 Final Fixing | 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో భారత జట్టు 2011లో వన్డే ప్రపంచ కప్ (2011 World Cup Final)ను కైవసం చేసుకుంది. అయితే ఆ వరల్డ్ కప్ ఫైనల్ ముందే ఫిక్సయిందని, అందువల్లే శ్రీలంక జట్టు అనూహ్యంగా ఓటమిపాలైందంటూ లంక అప్పటి క్రీడాశాఖ మంత్రి మహిదానంద అలుతగమగే సంచలన ఆరోపణలకు తెరలేపారు. అత్యంత ఖరీదైన ఫిక్సింగ్‌లలో 2011 వన్డే ప్రపంచ కప్ ఒకటని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇంటర్ 2020 ఫలితాలు వచ్చేశాయోచ్
గతంలో శ్రీలంక దిగ్గజ కెప్టెన్, 1996 వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిపిన అర్జున రణతుంగ సైతం ఇదే ఆరోపణలు చేశారు. ఫిక్సింగ్ కారణంగానే లంక జట్టు 2011 ఫైనల్లో ఓటమిపాలైందని, విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వరల్డ్ కప్ భారత్ గెలిచి ఉండవచ్చు, కానీ శ్రీలంక ఆ కప్పును అమ్మేసిందని తాజాగా శ్రీలంక మాజీ మంత్రి మహిదానంద సంచలన ఆరోపణలు చేశారు. అమర జవాన్లపై ట్వీట్.. టీమ్ డాక్టర్‌పై CSK వేటు
సిరస టీవీతో మాట్లాడుతూ.. ఫైనల్లో లంక గెలుస్తుందని భావించగా అనూహ్యంగా భారత్ ప్రపంచ కప్ (2011 World Cup Final) Winner) ఎగరేసుకుపోయిందని క్రీడాశాఖ మాజీ మంత్రి మహిదానంద పేర్కొన్నారు. ఆ విషయాలు ఇప్పుడు మాట్లాడదలుచుకోలేనంటూ ఫిక్సింగ్ ఆరోపణలకు తెరలేపారు. ఆటగాళ్లను తాను కలవలేదని, కానీ ఫిక్సింగ్ కారణంగా భారత్ ఆ ఫైనల్లో లంక జట్టును ఓడించిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిహారిక పెళ్లి ఫిక్స్.. క్లారిటీ అడుగుతున్న నెటిజన్లు
ఆ ఫైనల్ మ్యాచ్‌కు కామెంటెటర్‌గా చేసిన మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ సైతం 2017లో ఇలాంటి ఆరోపణలు చేశారు. దీనిపై విచారణ జరిగితే నిజాలు బయటకొస్తాయి. ఆ రోజు అన్ని విషయాలు బటయపెడతానని కామెంట్ చేశాడు. ఫైనల్లో ఉద్దేశపూర్వకంగానే బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో లంక విఫలమైందని రణతుంగ అభిప్రాయపడ్డాడు.
కాగా, ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరిగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేయగా, భారత్ కేవలం 4 వికెట్లు కోల్పోయి మరో పది బంతులు మిగిలుండగానే మ్యాచ్ నెగ్గి వరల్డ్ కప్‌ను సాధించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ