ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ సంక్రమణ ( Coronavirus spread ) వేగంగా పెరుగుతున్న నేపధ్యంలో ఈసారి హజ్ యాత్ర ( HAJJ Pilgrimage ) ఉండదని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ( Central minister Mukhtar Abbas Nakhvi ) స్పష్టం చేశారు. ఇప్పటికే యాత్రకు దరఖాస్తు చేసుకున్నవారి డబ్బుల్ని వెనక్కి ఇస్తామని ఆయన చెప్పారు. ఈ ఏడాదికి అనుమతి పొందినవారు 2021లో వినియోగించుకునే సౌలభ్యం ఉందన్నారు మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ.
( Also read : Pak cricket team: పాక్ క్రికెట్ టీమ్‌కు కరోనా పాజిటివ్ )
హజ్ యాత్రికులపై పరిమితి విధించిన సౌదీ అరేబియా ( LIMITED HAJJ IN SAUDI ARABIA ) :
కరోనావైరస్ సంక్రమణ నేపధ్యంలో ఈ ఏడాది హజ్ యాత్రను ( HAJJ PILGRIMAGE ) పరిమితం చేసినట్టు సౌదీ అరేబియా సైతం స్పష్టం చేసింది. కేవలం సౌదీ అరేబియన్లు, దేశంలో ఇప్పటికే ఉన్న విదేశీయులకు మాత్రమే హజ్ యాత్రకు అనుమతి ఉంటుందని ప్రకటించింది.
( Also read: Lockdown in Bengaluru: కర్ణాటక సర్కార్‌కి కుమారస్వామి హెచ్చరిక )
ప్రతియేటా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది సంఖ్యలో ముస్లింలు హజ్ యాత్ర చేస్తుంటారు. కానీ ఈసారి ఆ అవకాశం లేదు. వచ్చే నెలలో హజ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తుల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు సౌదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీవితంలో ఒక్కసారైనా మక్కాను సందర్శించుకోవాలనుకునే ముస్లింలకు ఇది కచ్చితంగా నిరాశకు గురి చేసే అంశమే అవుతుంది. సౌది అరేబియా సైతం ఇతర దేశాల భక్తుల హజ్ యాత్రపై నిషేధం విధించడం ఇదే తొలిసారి. గత యేడాది 2.5 మిలియన్ల మంది భక్తులు మక్కాను సందర్శించారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..