PM Modi`s Ladakh visit: ప్రధాని లఢక్ పర్యటనపై స్పందించిన చైనా

China on PM Modi`s Ladakh visit: భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను నివారిస్తే బాగుంటుందని చైనా అభిప్రాయపడింది. ప్రధాని నరేంద్ర మోదీ లఢఖ్‌లో ( PM Modi in Ladakh ) ఆకస్మికంగా పర్యటించిన కొన్ని గంటల్లోనే చైనా ఈ ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

Last Updated : Jul 3, 2020, 09:36 PM IST
PM Modi`s Ladakh visit: ప్రధాని లఢక్ పర్యటనపై స్పందించిన చైనా

China on PM Modi`s Ladakh visit: భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను నివారిస్తే బాగుంటుందని చైనా అభిప్రాయపడింది. ప్రధాని నరేంద్ర మోదీ లఢఖ్‌లో ( PM Modi in Ladakh ) ఆకస్మికంగా పర్యటించిన కొన్ని గంటల్లోనే చైనా ఈ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. చైనాను ఉద్దేశపూర్వకంగా తప్పుడు అంచనా వేసే అలవాటును భారత్ మానుకోవాలని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. భారత్ - చైనా మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని.. ఇరుదేశాల మధ్య మిలిటరీ, దౌత్యపరమైన మార్గాల ద్వారా చర్చలు జరుగుతున్న తరుణంలో సరిహద్దుల్లో మరింత ఉద్రిక్త పరిస్థితులు ( Indo-China border ) తలెత్తేలా ఏ ఒక్కరూ  వ్యవహరించకూడదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ పేర్కొన్నారు. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ నిత్యం ఇచ్చే అధికారిక ప్రకటనల్లో భాగంగానే శుక్రవారం చైనా ఈ ప్రకటన విడుదల చేసింది. ( Also read: PM Modi Visits Leh: లేహ్‌లో ప్రధాని మోదీ ఆకస్మిక పర్యటన )

ప్రధాని నరేంద్ర మోదీ లఢఖ్ పర్యటనలో ఆయన వెంట భారత రక్షణ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ ( CDS General Bipin Rawat ), ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నవరానె ( Manoj Mukund Naravane ) ఉన్నారు. అక్కడ ప్రధాని మోదీ ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్ ( ITBP ) బలగాలకు చెందిన ఉన్నతాధికారులు, సైనికులను కలిసి మాట్లాడారు. భారత్-చైనా ఘర్షణ ( India China faceoff ) విషయంలో భారత్ సైనికులు చూపిన ధైర్య, సాహసాలు యావత్ ప్రపంచానికి స్పూర్తినిచ్చాయని అన్నారు. యావత్ దేశం సైనికుల వెంటే ఉందని ప్రధాని మోదీ వారికి ధైర్యం చెప్పారు. ( Also read: Chinese apps banned: చైనా యాప్స్‌ నిషేధం.. స్పందించిన చైనా సర్కార్ )

లఢఖ్‌లో ప్రధాని మోదీ చేపట్టిన పర్యటనను చైనా అంతర్గతవర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి ( China watching PM Modi ). ప్రధాని మోదీ పర్యటన ఇటు భారత్, అటు చైనాకే కాకుండా ప్రపంచానికి ఎటువంటి సందేశాన్ని ఇస్తోంది అనే అంశంపైనా చైనా ఓ కన్నేసింది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

 

Trending News