భారతదేశానికి ప్రధాన శత్రువు ఎవరిప్పుడు? చైనా, పాకిస్తాన్ రెండింటిలో దేనితో మనకు ప్రమాదం ? ఇదేం ప్రశ్ననుకుంటున్నారా? అవును మరి..పాకిస్తాన్ తో కంటే చైనాతోనే ఎక్కువ ముప్పు ఉందంటున్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ( Sharad pawar ) .
ఇండో చైనా సరిహద్దు ( Indo-china border ) వివాదం, గల్వాన్ లోయ ( Galwan Valley ) లో జరిగిన ఘర్షణ నేపధ్యంలో భారతదేశం అప్రమత్తమవుతోంది. ఈ క్రమంలోనే ఎన్సీపీ అధినేత ( NCP Leader ) , రాజకీయ దురంధరుడైన శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనమవుతున్నాయి. ఇప్పటివరకూ పాకిస్తాన్ ( Pakistan ) మాత్రమే భారతదేశానికి ప్రధాన శత్రువుగా, ప్రమాదకారిగా భావిస్తున్నారు అంతా. కానీ ఇది తప్పంటున్నారు శరద్ పవార్. శివసేన ముఖపత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శరద్ పవార్ చేసిన ఈ తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనమవుతున్నాయి. పాకిస్తాన్ కంటే చైనాతోనే దేశానికి ముప్పు ఎక్కువగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్బంగా దేశ భద్రతకు సంబంధించిన పలు అంశాలపై ఆయన స్పందించారు. చైనా, పాకిస్తాన్ లతో పాటు నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలు కూడా భారత్ కు శత్రుదేశాలేనని ఆయన వెల్లడించారు. బంగ్లాదేశ్ లోని అంతర్గత సమస్యను పరిష్కరించడానికి భారతదేశం ప్రయత్నిస్తుంటే...బంగ్లాదేశ్ మాత్రం చైనాతో ఒప్పందాలు చేసుకుంటుందని ఆయన గుర్తు చేశారు. Also read: TikTok ban: చైనాపై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం..
చైనా పర్యటనలో ఆ దేశాధ్యక్షుడు జిన్ పింగ్ తో దేశ ప్రధాని నరేంద్రమోదీ ( PM Narendra Modi ) షేక్ హ్యాండ్ లు ఇచ్చుకోవడం ద్వారా సమస్యలు పరిష్కారం కావని అన్నారు శరద్ పవార్. అయితే రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదని..అంతర్జాతీయంగా చైనాపై ఒత్తిడి తీసుకురావల్సిన అవసరం ఉందన్నారు.దేశానికి సంబంధించిన ముఖ్యమైన అంశాల్లో సైతం కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలతో సంప్రదించడం లేదంటూ శరద్ పవార్ ఆరోపణలు చేశారు. Also read: Covid19 crime: భార్య శాంపిల్స్..పనిమనిషి పేరుతో
చైనా సైనిక శక్తి భారతదేశం కంటే పదిరెట్లు బలీయమైందని శరద్ పవార్ చెప్పడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. దీర్ఘకాలికంగా చూస్తే పాకిస్తాన్ కంటే చైనాతోనే ఎక్కువ ఆందోళన చెందాల్సి ఉంటుందన్నారు. భారతదేశ పొరుగుదేశాల్ని ఇప్పటికే చైనా మచ్చిక చేసుకుంటోందని శరద్ పవార్ గుర్తు చేశారు. Also read: Remdesivir: ఆ మందుతో మరణాల రేటు తగ్గుతోందట