రాజస్థాన్ ప్రభుత్వం సంక్షోభం నేపధ్యంలో కోర్టుల విచారణ కొనసాగుతోంది. ఇటు రాజస్తాన్ హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు నిన్న సుప్రీంకోర్టు నుంచి...హైకోర్టు నుంచి ఆశాభంగమైంది. సచిన్ పైలట్ వర్గానికి ఊరట లభించింది.
రాజస్థాన్ హైకోర్టులో మాజీ డిప్యూటీ సీఎం, తిరుగుబాటు నేత సచిన్ పైలట్ వర్గానికి మరోసారి రిలీఫ్ కలిగింది. తనతో సహా 19 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి పంపించిన అనర్హత పిటీషన్లను సవాలు చేస్తూ సచిన్ వర్గం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలపై ఈనెల 24 వ తేదీ వరకూ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని గతంలో కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రతివాదిగా చేర్చాలన్న సచిన్ వర్గం వాదనతో కోర్టు ఏకీభవించింది. ఇది అశోక్ గెహ్లాట్ వర్గానికి మింగుడుపడని పరిణామమే. ఈ కేసులో అడినల్ సొలిసిటర్ జనరల్ కేంద్ర ప్రభుత్వం తరపున వాదించనున్నారు. హైకోర్టు విచారణపై స్టే ఇవ్వాల్సిందిగా కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వర్గానికి చుక్కెదురైన సంగతి తెలిసిందే. తాజాగా హైకోర్టులో కూడా సచిన్ వర్గానికే ఊరట లభించడం గమనార్హం. Also read: Babri Masjid demolition case:‘బాబ్రీ’ కేసులో జోషి వాంగ్మూలం నమోదు