భార‌త తొలి మ‌హిళా ఫొటో జ‌ర్నలిస్ట్ హోమై వ్యారావ‌ల్లా

ఈరోజు గూగుల్ డూడుల్ చూశారా ..! ఎవరో మహిళ కెమెరా పట్టుకొని ఫోటోలు తీస్తున్న స్టిల్ ఉంది కదూ..! ఆవిడే భారత తొలి మహిళా ఫోటో జర్నలిస్ట్ హోమై వ్యారావ‌ల్లా.

Last Updated : Dec 9, 2017, 07:07 PM IST
భార‌త తొలి మ‌హిళా ఫొటో జ‌ర్నలిస్ట్ హోమై వ్యారావ‌ల్లా

ఈ రోజు గూగుల్ డూడుల్ చూశారా ..! ఎవరో మహిళ కెమెరా పట్టుకొని ఫోటోలు తీస్తున్న స్టిల్ ఉంది కదూ..! ఆవిడే భారత తొలి మహిళా ఫోటో జర్నలిస్ట్ హోమై వ్యారావ‌ల్లా. ఇవాళ ఆమె పుట్టినరోజు. ఈ డూడుల్‌ను ముంబై వాసి సమీర్ కులవూర్ డిజైన్ చేశారు. ఇదొక్కటే కాదు..  గూగుల్ మనకు తెలియని ఎన్నో విషయాలను ఇలా డూడుల్ రూపంలో గుర్తుచేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే..! 

గుజరాత్‌లోని నవసారి ప్రాంతంలో డిసెంబర్ 9, 1913 తేదీన హోమై వ్యారావ‌ల్లా జన్మించారు.  1947, ఆగస్టు 15న  స్వాతంత్య్రం దినోత్సవం రోజున ఎగురవేసిన మొదటి జాతీయ పతాకం, మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి నాయకుల మొదటి ఫోటోలను ఈమె తీసింది. 1959లో అప్పటి దలైలామా సరిహద్దు దాటుతున్న ఫోటోలను కూడా తీసింది. వీటితో పాటు మరెన్నో చారిత్రక సంఘటనల ఫోటోలను  కూడా ఆమె తీయడం జరిగింది

రెండో ప్రపంచ యుద్ధం (1939-1945) సమయంలో హోమై  ఫోటో జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు. తర్వాత 1942లో బిట్స్ ఇన్ఫర్మేషన్ సర్వీస్‌లో ఉద్యోగిగా చేరారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఫోటోగ్రాఫర్‌గా పనిచేసే మానెక్ షా వ్యారావ‌ల్లాను వివాహం చేసుకున్నారు. జనవరి 15, 2012 తేదీన 98 ఏళ్ల వయసులో హోమై వ్యారావ‌ల్లా మరణించారు. 

Trending News