Satyendranath Bose: భారతీయ భౌతిక, గణిత శాస్త్రవేత్తకు సత్యేంద్ర నాథ్ బోస్ కు అరుదైన గౌరవం దక్కింది. గూగుల్ తన డూడుల్‌తో సత్యేంద్ర నాథ్ బోస్‌కు నివాళులర్పించింది. 98 సంవత్సరాల క్రితం ఇదే రోజు.. అంటే జూన్ 4, 1924న తన క్వాంటం సూత్రీకరణలపై తన పత్రాన్ని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌కు పంపారు బోస్. క్వాంటం మెకానిక్స్‌లో ఇదో ముఖ్యమైన ఆవిష్కరణగా నిలిచింది.
New Year's Eve 2021: 2021 సంవత్సరానికి వీడ్కోలు పలికేందుకు ప్రపంచమంతా సిద్ధమైంది. ఈ సందర్భంగా ఇంటర్నెట్ లో గూగుల్ ఓ కొత్త డూడుల్ నెటిజన్లకు పరిచయం చేసింది. క్యాండీలు, బెలూన్లు, లైట్లతో చాలా ఎంతో అందంగా దాన్ని ముస్తాబు చేసింది గూగుల్.
Google Birthday 2021: గూగుల్ సోమవారం తన 23వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ సందర్భాన్ని గుర్తు చేయడానికి, సెర్చ్ ఇంజిన్ దాని హోమ్‌పేజీలో డూడుల్‌తో వచ్చింది. యానిమేటెడ్ డూడుల్‌లో 23 అని వ్రాసిన కేక్ ఉంది, గూగుల్ లో L కి బదులుగా పుట్టినరోజు క్యాండిల్ ఉంది.
Green Tea: గ్రీన్ టీ. సకల సమస్యలకు కాకపోయినా చాలా సమస్యలకు పరిష్కారంగా వైద్యులు చెబుతుంటారు. ఆధునిక జీవనశైలిలో గ్రీన్ టీ ఓ భాగంగా మారింది. సన్నబడేందుకు ఓ ప్రత్యామ్నాయంగా ఉన్న గ్రీన్ టీ ఎప్పుడు పుట్టింది, ఎవరు కనిపెట్టారో తెలుసా. గ్రీన్ టీ సృష్టికర్తకు గూగుల్ డూడుల్ సమర్పించింది.
Shirley Temple's google doodle story: షిర్లే టెంపుల్.. 'అమెరికాలో గొప్ప నటి' అని సింపుల్‌గా చెబితే అది ఆమెను అవమానించినట్టే అవుతుంది. మూడేళ్లకే డ్యాన్సింగ్ మొదలుపెట్టి, సరిగ్గా ఆరేళ్లు ఉన్నప్పుడే డజన్‌కి పైగా సినిమాల్లో బాల నటిగా ఔరా అనిపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న షిర్లే టెంపుల్ గురించి ఎంత ఎక్కువ చెప్పినా ఇంకా ఏదో మిగిలిపోయినట్టే ఉంటుంది.
Google Doodle On International Womens Day 2021: ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ‘ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే’ను ఘనంగా సెలబ్రేట్ చేస్తారు. ఉమెన్స్ డే సందర్భంగా మహిళల్ని గౌరవిస్తూ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ డూడుల్ విడుదల చేసింది.
Google honour Zohra Sehgal with special doodle: భారతదేశం గర్వించదగిన నటీమణులు, లేడీ కొరియోగ్రాఫర్స్‌లో ఒకరైన జోహ్రా సెహగల్‌కి ( Actress Zohra Sehgal ) గూగుల్ మంగళవారం ప్రత్యేకమైన డూడుల్‌తో నివాళి అర్పించింది. 1946లో జోహ్రా నటించిన నీచ నగర్ అనే సినిమా ( Neecha Nagar movie ) కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో విడుదలైంది ఈ రోజే.
ఆధునిక బైనరీ సిస్టమ్ కనిపెట్టిన శాస్త్రవేత్త, జర్మనీ గణిత నిపుణుడు గోట్ ఫ్రైడ్ విల్హెమ్ లెబ్నిజ్కు ఆయన జయంతి సందర్భంగా గూగుల్ నివాళులు ఘటించింది. ఈ సందర్భంగా గూగుల్ డూడుల్‌ను విడుదల చేసింది.
చిప్కో ఉద్యమంలో 45వ వార్షికోత్సవం సందర్భంగా గూగుల్ ఈ ప్రత్యేక డూడుల్ ను రూపొందించింది. ఆధునిక భారతదేశంలో, చిప్కో ఉద్యమం ఏప్రిల్ 1973 లో ఎగువ అలకానంద లోయలో ఉత్తర ప్రదేశ్‌లోని మండల్ గ్రామంలో ప్రారంభమైంది.
భారత దేశానికి చెందిన, ప్రఖ్యాత షెహనాయ్ విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జయంతి నేడు. ఆయన 102వ జయంతి సందర్భంగా గూగుల్ ప్రత్యేక' డూడుల్ ను రూపొందించింది.
నోబెల్ గ్రహీత మ్యాక్స్ బోర్న్ యొక్క 135వ పుట్టినరోజున గూగుల్ ఒక డూడుల్ ను సృష్టించింది. ఈ డూడుల్ ను జర్మనీలోని బెర్లిన్ వాసి కాటి స్సిలాగి (Kati Szilagyi) తయారుచేసాడు.
డిసెంబరు 11, 1882 న జర్మనీలో జన్మించిన మ్యాక్స్ బోర్న్ 1954 లో 'ఫండమెంటల్ రీసర్చ్ ఇన్ క్వాంటం మెకానిక్స్' గానూ భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. నేడు క్వాంటం మెకానిక్స్ రంగంలో మ్యాక్స్ బోర్న్ యొక్క 'బోర్న్ థియరీ' క్వాంటం ఫిజిక్స్ లో దాదాపు ప్రతి పరిశోధనకు ఆధారంగా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.