#Watch Rafale fighter jetsకి అంబాలాలో ఘన స్వాగతం

అంబాలా: ఫ్రాన్స్ నుంచి భారత్‌కి సోమవారం బయలుదేరిన రాఫెల్ యుద్ధ విమానాలు కొద్దిసేపటి క్రితమే హర్యానాలోని అంబాలాలో ఉన్న వైమానిక స్థావరానికి చేరుకున్నాయి (Rafale fighter jets landed in Ambala).

Last Updated : Jul 29, 2020, 04:39 PM IST
#Watch Rafale fighter jetsకి అంబాలాలో ఘన స్వాగతం

 అంబాలా: ఫ్రాన్స్ నుంచి భారత్‌కి సోమవారం బయలుదేరిన రాఫెల్ యుద్ధ విమానాలు కొద్దిసేపటి క్రితమే హర్యానాలోని అంబాలాలో ఉన్న వైమానిక స్థావరానికి చేరుకున్నాయి (Rafale fighter jets landed in Ambala). ఫ్రాన్స్‌తో భారత్ కుదుర్చుకున్న యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భాగంగా మొదటి విడత కింద ఫ్రాన్స్ ఈ ఐదు రాఫెల్ ఫైటర్ జెట్స్‌ని భారత్‌కి అందించింది. భారత వైమానిక దళం చీఫ్ ఎయిర్ మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియా ఎయిర్ బేస్‌లో ఈ ఫైటర్ జెట్స్‌కు ఘన స్వాగతం పలికారు. అంబాలాలోని ఐఏఎఫ్ సిబ్బంది ఈ యుద్ధ విమానాలకు ఘన స్వాగతం పలుకుతూ ఫైర్ ఇంజిన్స్ ద్వారా నీటిని గుప్పించారు. Also read: Rafale: దిగ్విజయంగా శిక్షణ పూర్తి చేసుకున్న పైలట్లు

#WATCH Water salute given to the five Rafale fighter aircraft after their landing at Indian Air Force airbase in Ambala, Haryana. #RafaleinIndia pic.twitter.com/OyUTBv6qG2

— ANI (@ANI) July 29, 2020

 

 

రాఫెల్ ఫైటర్స్ జెట్స్ అంబాలాలో ల్యాండ్ అయిన వెంటనే భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆ దృశ్యాన్ని పోస్ట్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు.

The Touchdown of Rafale at Ambala. pic.twitter.com/e3OFQa1bZY

— Rajnath Singh (@rajnathsingh) July 29, 2020

Rafale Facts : రాఫెల్ విమానాల గురించి మీకు తెలియని 10 విషయాలుAlso read: 

  

Trending News