లెబనాన్ (Lebanon) రాజధాని బీరుట్లో మంగళవారం భారీ పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల ఘటనతో బీరుట్ (Beirut Explosion) ఒక్కసారిగా ఉలిక్కి పడింది. భారీ భవంతులు క్షణాల వ్యవధిలో నేలమట్టమయ్యాయి. భారీ పేలుళ్ల (Beirut Blasts) ఘటనలో దాదాపు 78 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని, అదే సమయంలో 4000 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. బీరుట్ ఓడరేవు కేంద్రంగా బాంబు పేలుళ్లు విధ్వంసం జరిగిందని అధికారులు చెబుతున్నారు. అయోధ్యలో నేడు ప్రధాని మోదీ షెడ్యూల్ ఇలా..
No words #Beirut https://t.co/ggQ0vmC3Fi
— Brian Niznansky (@BrianNizTMJ4) August 4, 2020
క్షణాల వ్యవధిలో...
లెబనాన్ రాజధాని బీరుట్ ఓడరేవులో టపాసులు నిల్వ చేసిన గోదాములలో పేలుడు (Explosion In Beirut) సంభవించడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. అధికారులు మాత్రం ఇందుకు కారణంపై ఏ ప్రకటన చేయలేదు. అయితే తొలుత టపాసులు పేలినట్లుగా చిన్నగా శబ్ధం వచ్చి, ఆపై అణుబాంబులు పేలుతున్నాయా అనే తరహాలో భారీ శబ్దాలతో విస్ఫోటనం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పేలుడు జరిగిన ప్రాంతంలో కొన్ని కిలోమీటర్ల మేర భవనాలు, నిర్మాణాలు దెబ్బతిన్నాయి. Photos: గులాబీ డ్రెస్సులో యంగ్ బ్యూటీ సోయగాలు..
#Beirut #Lebanon 💥💨 pic.twitter.com/pFXvDeKAgF
— Best Tweet (@BestTweet___) August 4, 2020
రెస్క్యూ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. శిథిలాల కింద ఇంకా ఎన్ని వేల మంది చిక్కుకున్నారో, మరణాల సంఖ్య ఎంతకు చేరుతుందోనని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. RGV హీరోయిన్ హాట్ ఫొటోలు వైరల్