Telangana: కొత్తగా 1,897 కరోనా కేసులు

తెలంగాణ కరోనా (Coronavirus) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. మరణాల సంఖ్య కూడా అదేస్థాయిలో పెరుగుతూనే ఉంది.

Last Updated : Aug 12, 2020, 09:55 AM IST
Telangana: కొత్తగా 1,897 కరోనా కేసులు

Covid-19 Cases: హైదరాబాద్‌: తెలంగాణ కరోనా ( Coronavirus ) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. మరణాల సంఖ్య కూడా అదేస్థాయిలో పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1,897 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా నిన్న 9మంది మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ (TS Health Ministry ) బుధవారం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 84,544కు పెరిగింది. దీంతోపాటు మరణాల సంఖ్య 654కి చేరింది. Also read: Bengaluru Riots: సోషల్ మీడియా పోస్ట్‌పై హింసాత్మక ఘర్షణలు.. ఇద్దరు మృతి

రాష్ట్రంలో ప్రస్తుతం 22,596 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 61,294 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. తెలంగాణలో రికవరీ రేటు 72.49 శాతం ఉండగా.. మరణాల రేటు 0.77 శాతంగా ఉంది.  రాష్ట్రంలో మంగళవారం అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 479 కేసులు నమోదుకాగా... మేడ్చేల్ జిల్లాలో 172, రంగారెడ్డి జిల్లాలో 162, సంగారెడ్డి జిల్లాలో 107 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కరోనా కేసులు ఈ విధంగా ఉన్నాయి..

telangana-corona-cases
 

Trending News