Izrael: మైనర్ పై దారుణం..30 మంది గ్యాంగ్ రేప్

ఇజ్రాయిల్  ( Izrael ) దేశంలో ఘోరం జరిగింది. మానవరూపం దాల్చిన మృగాలు రాక్షస కృత్యానికి పాల్పడ్డాయి.  ఒకరు కాదు ఇద్దరు కాదు..ఏకంగా 30 మంది ఓ మైనర్ బాలికపై ( Minor girl ) అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Last Updated : Aug 21, 2020, 07:16 PM IST
Izrael: మైనర్ పై దారుణం..30 మంది గ్యాంగ్ రేప్

ఇజ్రాయిల్  ( Izrael ) దేశంలో ఘోరం జరిగింది. మానవరూపం దాల్చిన మృగాలు రాక్షస కృత్యానికి పాల్పడ్డాయి.  ఒకరు కాదు ఇద్దరు కాదు..ఏకంగా 30 మంది ఓ మైనర్ బాలికపై ( Minor girl ) అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. 

ఇజ్రాయిల్ ( Izrael ) లోని ఈలాత్ నగరంలో ఘోరమే జరిగింది. రెడ్ సీ రిసార్ట్ ( Red sea resort ) చూడ్డానికి వెళ్లిన ఓ 16 ఏళ్ల మైనర్ బాలికపై కొంతమంది దుర్మార్గులు కన్నేశారు. రిసార్ట్ లో ఆమెను నిర్భంధించి ఏకంగా..ఒకరి తరువాత మరొకరు 30 మంది అత్యాాచారానికి ( Gang rape on a minor ) పాల్పడ్డారు. పోలీసులకు ఫిర్యాదివ్వడంతో..రంగంలో దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇద్దర్ని అరెస్టు చేశారు. విషయం కాస్తా వెలుగుచూడటంతో...దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. 

దోషుల్ని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ తో టెల్ అవివ్ ( Tel aviv ) , జెరూసలేం ( jerusalem ) నగరాల్లో ప్రజలు నిరసనకు దిగారు. అటు ఈ ఘటనపై దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. నోట మాట రావడం లేదని...షాకింగ్ అని ...విచారణకు ఆదేశించామన్నారు. ఇజ్రాయిల్ లో ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు అత్యాచారానికి గురవుతున్నట్టు మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. Also read: SBI ATM: మనీ కోసం ఇక ఏటీఎంకి కూడా వెళ్లక్కర్లేదు

Trending News