బాహుబలి ( Bahubali ) బంపర్ హిట్ తో దేశవ్యాప్తంగానే కాదు..ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రభాస్ ( Prabhas ) ఇప్పుడు ఎలా తయారు కానున్నాడు. విఖ్యాత ఆదిపురుష్ ప్రాజెక్టు కోసం ఎలా మారనున్నాడు.
పేరు ప్రకటించగానే బాహుబలి అంతగా ప్రాచుర్యం లభించేసింది ఆది పురుష్ ( Adipurush ) చిత్రానికి. బాగా ట్రెండ్ అవుతోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ ( Director Om raut ) దర్శకత్వంలో ఆదిపురుష్ చిత్రం నిర్మించనున్నారు. మరి ఈ చిత్రానికి ప్రధాన పాత్రగా రెబెల్ స్టార్ ప్రభాస్ ఉండటమే అసలు హైలైట్. బాహుబలి కోసం కండలు పెంచిన ప్రభాస్...ఆదిపురుష్ కోసం ఎలా సిద్ధమవుతున్నాడు..ఎలా మారనున్నాడనేది ఆసక్తిగా మారింది. అందుకే ఆ ఆసక్తికర విషయాల్ని చిత్ర దర్శకుడు ఓం రావత్ పంచుకున్నారు.
ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ శ్రీరాముని పాత్రలో ( prabhas as rama ) కన్పించనున్నారనే విషయం తెలిసిందే. ప్రభాస్ కెరీర్ లో ఉత్తమ చిత్రంగా నిలిచేలే రూపుదిద్దనున్నారు. ప్రభాస్ నిర్మలమైన మనస్సున్న వ్యక్తి అని...ప్రభాసే ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ అని దర్శకుడు ఓం రావత్ తెలిపాడు. రాధేశ్యామ్ ( Radhesyam movie ) సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత ఆదిపురుష్ కోసం ప్రభాస్ కు ఫిజికల్ ట్రాన్స్ ఫార్మేషన్ నిర్వహించనున్నామని ఓం రావత్ చెప్పారు. ఈ సినిమా కోసం రాముడి పాత్రలో ప్రభాస్ చాలా రకాల విలువిద్య సన్నివేశాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. అందుకే ప్రభాస్ కు విలువిద్యలో శిక్షణ ఇవ్వనున్నారు. 2021 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందన్నారు దర్శకుడు రావత్. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గణ్ నటించిన తానాజీ ద అన్ సంగ్ వారియర్ ( Tanaji the unsung warrior ) తో ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు ఓం రావత్. Also read: Sushant singh rajput: విష ప్రయోగం వల్లనే మరణం : బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి