Taj Mahal and Agra Fort to reopen: ఢిల్లీ: కరోనావైరస్ కారణంగా దేశంలోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలన్నీ మూతబడిన విషయం తెలిసిందే. అయితే అన్లాక్-4లో భాగంగా సెప్టెంబరు 1 నుంచి ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలన్నీ ఇప్పటికే తెరుచుకున్నాయి. అయితే యూపీలోని తాజమహాల్ (Taj Mahal), ఆగ్రాఫోర్ట్ మాత్రం ఇంకా సందర్శకుల కోసం ఓపెన్ కాలేదు. ఈ క్రమంలో సెప్టెంబరు 21 నుంచి తాజ్ మహల్, ఆగ్రా కోటను సందర్శకుల కోసం తిరిగి తెరవనున్నట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఆగ్రా సర్కిల్ సోమవారం ప్రకటించింది. కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి కారణంగా ఈ రెండు ప్రపంచ వారసత్వ కట్టడాలను మార్చి 17 నుంచి మూసివేశారు. Also read: India-China standoff: భారత్-చైనా సైన్యం మధ్య కాల్పులు..!
అయితే ఈ రెండు ప్రాంతాల్లో వేర్వేరుగా 2,500 మంది సందర్శకులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. దీంతోపాటు సందర్శకులకు ఎలక్ట్రానిక్ టికెట్లు జారీ చేయనున్నారు. పర్యాటకులంతా కొవిడ్ నిబంధనలను తప్పనసరిగా పాటించాలని ఈ మేరకు అధికారులు వెల్లడించారు. మాస్క్లులు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించాలని అధికారులు తెలిపారు. Walking Benefits: ప్రతీ రోజు వాకింగ్ చేయడం వల్ల కలిగే 5 లాభాలు ఇవే