TajMahal Gets bomb Threat: తాజ్ మహాల్ ను పేల్చివేస్తామని ఒక బెదిరింపు మెయిల్ ఆగ్రా పర్యటక విభాగానికి వచ్చినట్లు తెలుస్తొంది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
Taj Mahal Going To Dangerous Water Leakage Now Plant Grow: ప్రేమికుల నిలయమైన తాజ్‌మహల్ ప్రతిష్ట దిగజారుతోంది. మొన్న నీటి లీకేజ్ కాగా.. నేడు పిచ్చిమొక్కలు దర్శనమివ్వడంతో మహల్ ప్రమాదకరంగా మారింది.
Taj Mahal Gets Tax Notice: తాజ్ మహల్‌కి ఆగ్రా మునిసిపల్ వాటర్ సప్లై చేసినందుకు గాను సుమారు రూ. కోటి రూపాయల వరకు వాటర్ బిల్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆగ్రా మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అంతేకాదండోయ్.. తాజ్ మహల్ ప్రాపర్టీ టాక్స్ కూడా బకాయి పడిందట.
Madhya Pradesh Taj Mahal Replica: అప్పట్లో తన భార్య ముంతాజ్ పై ప్రేమతో తాజ్ మహల్ లాంటి అద్భుతమైన కట్టడాన్ని నిర్మించారు షాజహాన్. ఇప్పటివరకు తాజ్ మహల్ పేరు చెబితే గుర్తొచ్చే విషయం ఇది. కానీ, ఇప్పుడు మరో షాజహాన్ తన భార్య కోసం మధ్యప్రదేశ్ లో మరో తాజ్ మహల్ కట్టించాడు. మూడేళ్ల పాటు శ్రమించి నిర్మించిన ఈ నయా తాజ్‌మహల్‌ను భార్యకు కానుకగా అందించారు.
Taj Mahal night viewing in moonlight: కరోనావైరస్ మహమ్మారి కారణంగా 2020 మార్చి 17 నుంచి పర్యాటకులకు తాజ్ మహల్ వీక్షించేందుకు అనుమతి రద్దయిన సంగతి తెలిసిందే. అయితే, దేశంలో కరోనావైరస్ కేసులు (Coronavirus cases) అదుపులోకి వచ్చిన నేపథ్యంలో ఇటీవలే తిరిగి సందర్శకులకు స్వాగత ద్వారాలు తెరిచారు.
కరోనావైరస్ కారణంగా దేశంలోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలన్నీ మూతబడిన విషయం తెలిసిందే. అయితే అన్‌లాక్-4లో భాగంగా సెప్టెంబరు 1 నుంచి ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలన్నీ ఇప్పటికే తెరుచుకున్నాయి. అయితే యూపీలోని తాజమహాల్, ఆగ్రాఫోర్ట్ మాత్రం ఇంకా సందర్శకుల కోసం తెరుచుకోలేదు.
మీ ఊళ్లో .. ఎమ్మెల్యే వచ్చినప్పుడు .. లేదా ముఖ్యమంత్రి వచ్చినప్పుడు .. అధికారులు ఏం చేస్తారో గుర్తుందా.. ? అవును .. మీరు ఊహించింది కరెక్టే. ప్రజాప్రతినిధి వస్తున్నప్పుడు దోమలు రాకుండా పౌడర్ చల్లుతారు. రోడ్లన్నీ శుభ్రం చేస్తారు. సరిగ్గా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వచ్చినప్పుడు కూడా ఉత్తరప్రదేశ్, గుజరాత్ అధికారులు అదే చేస్తున్నారు.
ప్రపంచ వింతలో ఒకటిగా గుర్తింపుబడ్డ తాజ్‌మహల్ మనకు ఎప్పటికీ వెలకట్టలేని ఆస్తిగానే మిగిలిపోతుంది. అలాంటి అందమైన,చిరస్మరణీయమైన కట్టడంపై పాలకులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఇది సామన్య జనాల వాయిస్ కాదు ..ఏకంగా అత్యున్నత ధర్మాసనమే చెప్పింది.
తాజ్ మహల్ ను ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక బుక్ లెట్ లో చేర్చకపోవడంతో మొదలైన రగడ ఇప్పటికీ చర్చనీయాంశయంగానే ఉంది. ఈ అంశంపై బీజీపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధాలు జరుగుతోంది. ప్రధాని మోదీ 'తాజ్ మహల్' అంశంపై స్పందించినా.. చారిత్రక కట్టడంపై పలు వ్యాఖ్యలు, విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ తాజ్ మహల్ పై తనదైన రీతిలో స్పందించాడు. ఈ మేరకు ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేశాడు.
భారతీయ జనతా పార్టీ నాయకుడు, ఉత్తర ప్రదేశ్ సర్దానా ఎమ్మెల్యే సంగీత్ సోమ్ దిగ్గజ స్మారక చిహ్నం తాజ్ మహల్ పై మరొక వివాదానికి తెరలేపారు. ప్రపంచ ప్రఖ్యాత స్మారక కట్టడాన్ని "ద్రోహులు నిర్మించారని, భారతీయ చరిత్రలో భాగం కాదని" అన్నారు.
"యుపి పర్యాటక బుక్లెట్ నుండి తాజ్ మహల్ ను తొలగించారని చాలా మంది నిరాశ చెందారు. మనం ఏ చరిత్ర గురించి మాట్లాడుతున్నాం? తాజ్ మహల్ సృష్టికర్త తన తండ్రిని ఖైదు చేశాడు. అతను హిందూలను తుడిచివేయాలని కోరుకున్నాడు. ఇలాంటి ప్రజలు మన చరిత్రలో భాగమైతే, అంతకంటే విచారం మరేదీలేదు. మేము ఈ చరిత్రను మారుస్తాము" అని చెప్పారు.
తాజ్ మహల్.. ఏడు ప్రపంచ వింతల్లో ఒక్కటైన ఓ అద్భుత కట్టడం. ఈ మహా సౌందర్య కట్టడాన్ని చూడడానికి దేశ, విదేశాల నుండీ కూడా ఎందరో యాత్రికులు వస్తుంటారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో నిర్మితమైన ఈ గొప్ప కట్టడానికి, ఆ రాష్ట్ర పర్యాటక బుక్‌లెట్‌లోనే స్థానం దొరకకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.