క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిన ఏపీ సీఎం, జగన్, పవన్

ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ నరసింహన్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్  రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

Last Updated : Dec 25, 2017, 11:36 AM IST
క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిన ఏపీ సీఎం, జగన్, పవన్

ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ నరసింహన్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్  రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

గవర్నర్ మాట్లాడుతూ- "ప్రేమ, కరుణ ద్వారా మానవాళిలో ఆనందం నింపిన  క్రీస్తు  జీవితం అందరికీ ఆదర్శనీయమని, క్రిస్మస్ పండుగను ప్రజలందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలి" అన్నారు. 

ఆంధ్ర ప్రదేశ్ సీఎం మాట్లాడుతూ- "క్రీస్తు లోక రక్షకుడిగా జన్మించిన రోజే క్రిస్మస్ అని, ఆయన విశ్వమానవాళి శ్రేయస్సును కాంక్షించారు. సర్వమానవ సమానత్వం, శాంతి, సహనం, ప్రేమ కలిగి ఉండాలని, నిస్సాహాయులపై కరుణ చూపాలని క్రీస్తు శతాబ్దాల క్రితమే బోధించారు.ఆయన బోధనలు స్మరణీయం, ఆచరణీయం" అన్నారు.

ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మాట్లాడుతూ- "సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల  కరుణ, సహనం, అవధుల్లేని త్యాగం, శత్రువుల పట్ల సైతం క్షమాగుణం.. ఇవన్నీ యేసు తన జీవితం ద్వారా మానవాళికి ఇచ్చిన మహోన్నత సందేశాలు" అని అన్నారు.

"క్రీస్తు జన్మించిన శుభసమయాన సమస్త మానవాళికి తన తరుఫున, తన జనసేన శ్రేణుల తరుఫున ప్రేమపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు" అని జనసేన అధినేత పవన్ తెలిపారు. 

Trending News