Nobel Prize in Physics: న్యూఢిల్లీ: భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం (Nobel Prize 2020) ముగ్గురు ప్రముఖ శాస్త్రవేత్తలను వరించింది. కృష్ణ బిలం, పాలపుంతపై జరిపిన పరిశోధనలకు గానూ ముగ్గురు శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఎంపికయ్యారు. భౌతిక శాస్త్రం ( Physics) లో 20202 నోబెల్ పురస్కారాన్ని శాస్త్రవేత్తలు రోజర్ పెన్రోస్ (Roger Penrose), రీన్హార్డ్ గెంజెల్ (Reinhard Genzel ), ఆండ్రియా ఘెజ్ (Andrea Ghez) లకు సంయుక్తంగా అందజేయనున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (The Royal Swedish Academy of Sciences) మంగళవారం ప్రకటించింది. కృష్ణ బిలంపై జరిపిన పరిశోధనలకు అదేవిధంగా పాల పుంత మధ్య భాగంలో సూపర్‌మాసివ్ కాంపాక్ట్ ఆబ్జెక్ట్‌ను కనుగొన్నందుకు వీరిని ఎంపిక చేసినట్లు స్వీడిష్ అకాడమీ తెలిపింది. అయితే ఇందులో రోజర్ పెన్రోస్కు సగం పురస్కారాన్ని ప్రకటించగా.. మిగతా సగం పురస్కారాన్ని రీన్హార్డ్, ఆండ్రియా ఘెజ్‌లు పంచుకోనున్నారు. ఈ మేరకు వారికి 10 మిలియన్ల స్వీడిష్ క్రోనార్లు చెల్లించనున్నట్లు స్వీడిష్ అకాడమీ పేర్కొంది.
BREAKING NEWS:
The Royal Swedish Academy of Sciences has decided to award the 2020 #NobelPrize in Physics with one half to Roger Penrose and the other half jointly to Reinhard Genzel and Andrea Ghez. pic.twitter.com/MipWwFtMjz— The Nobel Prize (@NobelPrize) October 6, 2020
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కనుగొన్న సాపేక్ష సిద్ధాంతం కృష్ణ బిలాలు ఏర్పడటానికి బలమైన కారణమని బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త రోజర్ పెన్రోస్ కనుగొన్నారు. అయితే.. అమెరికాలోని బర్క్లీ, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన రీన్హార్డ్ గెంజెల్, అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ఆండ్రియా ఘెజ్‌లు పాలపుంత కేంద్రంలో సూపర్‌మాసివ్ కాంపాక్ట్ ఆబ్జెక్ట్స్‌ను కనుగొన్నారు. పాల పుంత మధ్య భాగంలో నక్షత్రాల కక్ష్యలపై కంటికి కనిపించని, అత్యంత భారీ పదార్థం ప్రభావం చూపుతోందని వీరు పరిశోధనలతో వివరించారు. ఈ మేరకు వారిని ఎంపిక చేసినట్లు స్వీడిష్ అకాడమీ వివరించింది. Also read: Hathras Case: అందుకే అర్థరాత్రి అంత్యక్రియలు: యూపీ ప్రభుత్వం