విశాఖపట్నం జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (DMHO) మెడికల్, నాన్ మెడికల్ పోస్టుల భర్తీ చేపట్టారు. ఒప్పంద లేక ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 322 ఖాళీలున్నాయి. స్టాఫ్ నర్సు, స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్, కన్సల్టెంట్, హాస్పిటల్ అంటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్, సైకాలజిస్ట్, వార్డు క్లీనర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, సూపర్‌వైజర్ వంటి మొత్తం 322 పోస్టుల (DMHO Visakhapatnam Jobs,) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ పోస్టులకు ఈ దరఖాస్తు కాపీతో పాటు విద్యార్హతల జిరాక్స్‌లను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం, విశాఖపట్నం నందు సమర్పించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అక్టోబర్ 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వివరాలకు అధికారిక వెబ్‌సైట్స్ http://visakhapatnam.ap.gov.in, http://visakhapatnam.nic.in ఉన్నాయి.
పోస్టుల ఆధారంగా.. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, జీఎన్ఎం, బీఎస్సీ (నర్సింగ్), బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో తగిన అనుభవం కలిగి ఉండాలి. మెరిట్ ఆధారంగా ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. TS EAMCET 2020 Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఇక్కడ చూసుకోండి
నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ కోసం క్లిక్ చేయండి
దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.400, ఇతరులకు రూ.200గా నిర్ణయించారు. అక్టోబర్ 5తో ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 10న ముగియనుంది. మెరిట్ జాబితా వెల్లడి, అభ్యంతరాల స్వీకరణ అక్టోబర్ 15న చేస్తారు. రిజర్వేషన్ల ఆధారంగా తుది మెరిట్ జాబితా అక్టోబర్ 17న విడుదల చేయనున్నారు. నియామక ఉత్తర్వులు అక్టోబర్ 19న జారీ అవుతాయి.
చిరునామా: DMHO, Visakhapatnam, AP.
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం, విశాఖపట్నం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe