దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుపై మరోసారి నిషేధమా ? చరిత్ర పునరావృతం కానుందా ?

దక్షిణాఫ్రికా క్రికెట్ లో చరిత్ర పునరావృతం కానుందా. 50 ఏళ్ల క్రితం ఏ కారణాలతో అయితే నిషేధానికి గురైందో ఇంచుమించు అవే కారణాలు మళ్లీ ఎదురవుతున్నాయా? కొత్తగా ప్రభుత్వ జోక్యం కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి దూరం కానుందా?  అసలేం జరుగుతోంది ? 

Last Updated : Oct 15, 2020, 05:45 PM IST
దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుపై మరోసారి నిషేధమా ? చరిత్ర పునరావృతం కానుందా ?

దక్షిణాఫ్రికా క్రికెట్ ( South Africa cricket ) లో చరిత్ర పునరావృతం కానుందా. 50 ఏళ్ల క్రితం ఏ కారణాలతో అయితే నిషేధానికి గురైందో ఇంచుమించు అవే కారణాలు మళ్లీ ఎదురవుతున్నాయా? కొత్తగా ప్రభుత్వ జోక్యం కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి దూరం కానుందా?  అసలేం జరుగుతోంది ? 

దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు లేదా క్రికెట్ ఇన్ సౌత్ ఆఫ్రికా ( Cricket South africa ) ( CSA ) కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి ఆరోపణలు, జాతి వివక్ష, వేతనాల్లో అవకతవకలు ఎదుర్కొంటున్న సీఎస్ఏ వ్యవహారాల్లో ఇకపై జోక్యం చేసుకుంటున్నట్టు దక్షిణాఫ్రికా ప్రభుత్వం  ( South Africa government ) ప్రకటించింది. ఆ దేశపు క్రీడాశాఖ మంత్రి నాతి మెథ్వీ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. క్రికెట్ బోర్డు తమ తీరు మార్చుకోవాలని చాలాసార్లు అదేశించినప్పటికీ బోర్డు సభ్యుల తీరులో ఎలాంటి మార్పు రాలేదని క్రీడాశాఖ మంత్రి నాతి మెథ్వీ తెలిపారు. సీఎస్‌ఏలో పాలనాపరమైన నిర్ణయాలలో జరుగుతున్న పొరపాట్లును సరిదిద్దుకోవాలని చాలాసార్లు సూచించామని..కానీ కానీ వారిలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని..ఇకపై ఆ సభ్యులతో ఎలాంటి చర్చలుండవన్నారు. 

వాస్తవానికి గతంలో అంటే సెప్టెంబర్ 11నే దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుతో పాటు అపెక్స్ క్రికెట్ రెగ్యులేటరీను రద్దు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా క్రీడాశాఖ మంత్రి చేసిన ప్రకటనతో స్పష్టత వచ్చింది. ఇప్పుడు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డును స్వాధీనం చేసుకోడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బోర్డు విషయంలో ఎందుకు జోక్యం చేసుకోకూడదో వివరణ ఇవ్వాలని అక్టోబర్ 27 వరకూ ప్రభుత్వం గడువిచ్చింది. బోర్డులో ఏర్పడిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చాలాసార్లు ప్రయత్నించనప్పటికి సీఎస్‌ఏలో మార్పు రాలేదని..అందుకే పూర్తి స్ధాయి చర్యలకు దిగామనేది ఆ దేశపు క్రీడాశాఖ చెబుతున్నమాట. 2019 డిసెంబర్ నుంచి దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తప్పులు చేస్తూ పోతోందని..అవినీతి ఆరోపణలున్నాయని ప్రభుత్వం తరపున మంత్రి చెప్పారు.  Also read: Steve Smith about DC bowlers: ఢిల్లీ బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయాం: స్టీవ్ స్మిత్

అయితే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిబంధనల ( ICC Rules and regulations ) మేరకు ఏ దేశపు క్రికెట్ బోర్డు వ్యవహారంలోనైనా ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు. అదే జరిగితే ఆ దేశపు క్రికెట్ బోర్డును ఐసీసీ బహిష్కరిస్తుంది. ఇప్పుడిదే చర్చనీయాంశమవుతోంది. 

ఎందుకంటే గతంలో అంటే 1970లో తొలిసారి ఐసీసీ..దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డును ( ICC ban on South Africa cricket team  ) బహిష్కరించింది. అది కూడా ఏకంగా 20 ఏళ్లు ఆ  దేశం బహిష్కరణకు గురైంది. దీనికి కారణం అప్పట్లో ఆ దేశం అవలంభించిన జాతి వివక్ష విధానాలు. అప్పట్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తప్ప మరే ఇతర దేశంతోనూ క్రికెట్ ఆడకూడదని దక్షిణాఫ్రికా  ప్రభుత్వం ఆదేశాలాచ్చింది. అంతేకాకుండా టీమ్ లో కూడా కేవలం తెల్లవారినే ఆడించాలని ఆదేశించింది.  దాంతో అప్పట్లో ఐసీసీ దక్షిణాఫ్రికాను 20 ఏళ్ల పాటు నిషేధించింది. ఇప్పుడు మళ్లీ దక్షిణాఫ్రికాపై నిషేధం విధిస్తే..ఐసీసీ ( ICC ) నుంచి రెండోసారి బ్యాన్ కు గురైన తొలిదేశమవుతుంది.  Also read: Fastest Ball In IPL: డెల్ స్టెయిన్ రికార్డు బద్దలు.. ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన బౌలర్ ఇతడే

Trending News