బ్లూ వేల్ గేమ్ వార్తలు ఈ మధ్య హాట్ టాపిక్ గా మారాయి. కొన్ని రాష్ట్రాలు ఏకంగా ఈ గేమ్ పై అధికారికంగా నిషేధం ప్రకటించాయి. మరికొన్ని రాష్ట్రాలు అనధికారికంగా బ్యాండ్ చేశాయి. కానీ ఎక్కడో ఒకచోట బ్లూ వేల్ గేమ్ వార్త గుప్పుమంటూనే ఉంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో 21ఏళ్ల యువకుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తీరా విషయం తెలిసి విస్తుపోయారు.
వివరాల్లోకి వెళితే.. గతవారం మండిలో ఇంటర్-స్టేట్ బస్ టర్మినల్ లో బాంబు ఉందని స్టేషన్ కు ఫోన్ చేసి చెప్పాడు. అది రాంగ్ కాల్ కావడంతో పోలీసులు.. ఆ కాల్ ఎక్కడ నుంచి వచ్చిందని దర్యాప్తు చేయడం ప్రారంభించారు.
డిసెంబర్ 21న మండి బస్ స్టాండ్ అసిస్టెంట్ ఇంచార్జ్, నేత్ర సింగ్ కు ఒక గుర్తుతెలియని నెంబర్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. స్టేషన్ లో బాంబు ఉందని చెప్పాడు. ఆతరువాత వెనువెంటనే కాల్ కట్ అయ్యింది. సింగ్, వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు బాంబ్ స్క్వాడ్ పరికరాలు, జాగిలాలతో వచ్చి స్టేషన్ అంతా ఇంచుయించు గాలించారు. చివరాఖరికి బాంబు లేదని.. ఊపిరి పీల్చుకున్నారు.
సందీప్ కంప్యూటర్ అప్లికేషన్ లో మాస్టర్ డిగ్రీ చదువుతున్నారు. బ్లూ వేల్ మోజులో పడి ఇదంతా చేశాడని ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు.
బ్లూ వేల్ గేమ్ ను ఎక్కువగా యువకులు ఆడుతున్నారు. వారు లెవెల్స్ ఆడి.. ఆడి.. చివరి లెవల్స్ కి వచ్చేసరికి వారికొక ఫోన్ కాల్ వస్తుంది. గేమ్ పూర్తిచేయాలంటే ఆత్మహత్య చేసుకోవడం, చేతులు కోసుకోవడం.. లాంటి హింసాత్మక చర్యలకు పాల్పడితే గేమ్ లో గెలుస్తారని చెప్తారు. యువకులు గెలవాలనే లక్ష్యంతో ముందు, వెనుక ఆలోచించకుండా ఇలాంటి చర్యలకు పాల్పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పోలీసులు హితవు పలికారు.