Bigg Boss Telugu 4: ఎలిమినేషన్ ప్రమాదంలో ఎవరున్నారు ?

Bigg Boss Telugu 4 nominations, eliminations: బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో కంటెస్టెంట్స్ మధ్య పోటీ వాడి వేడిగా సాగుతోంది. ఈ వారం అవినాష్, అమ్మ రాజశేఖర్, అభిజిత్, మోనాల్ గజ్జర్, దేత్తడి హారిక.. ఈ ఐదుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షోలో వచ్చే నెలలో గ్రాండ్ ఫినాలే ( Bigg Boss 4 Telugu grand finale ) ఉంటుంది కనుక ఈ వారాంతంలో ఎలిమినేషన్ జరగడం తప్పనిసరి.

Last Updated : Nov 6, 2020, 04:05 AM IST
Bigg Boss Telugu 4: ఎలిమినేషన్ ప్రమాదంలో ఎవరున్నారు ?

Bigg Boss Telugu 4 nominations, eliminations: బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో కంటెస్టెంట్స్ మధ్య పోటీ వాడి వేడిగా సాగుతోంది. నాగార్జున అక్కినేని ( Nagarjuna Akkineni ) హోస్ట్ చేస్తోన్న ఈ షోలో ఈ వారం అవినాష్,  అమ్మ రాజ‌శేఖ‌ర్, అభిజిత్, మోనాల్ గజ్జర్, దేత్తడి హారిక.. ఈ ఐదుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. కంటెస్టంట్స్ అసలైన ఆటను కనబరిచే సమయం ఆసన్నమయింది అని నామినేషన్ ప్రక్రియ రోజు బిగ్ బాస్ తెలపగా ఒక్కో కంటెస్టెంట్ సేఫ్ గేమ్స్ ఆడకుండా నామినేట్ చేశారు. బిగ్ బాస్ షోలో వచ్చే నెలలో గ్రాండ్ ఫినాలే ( Bigg Boss 4 Telugu grand finale ) ఉంటుంది కనుక ఈ వారాంతంలో ఎలిమినేషన్ జరగడం తప్పనిసరి.

Also read : Bigg Boss 4 Telugu: అభిజీత్ గురించి వాళ్లమ్మ ఏం చెప్పిందంటే

అయితే ఇప్పుడు ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే ప్రశ్నే ప్రస్తుతం బిగ్ బాస్ ఫాలోవర్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. గత వారం సింగర్ నోయల్ ( Bigg Boss contestant Singer Noel Sean ) అనారోగ్య కారణాలతో బయటికి వెళ్లడంతో మోనాల్, అమ్మ రాజశేఖర్‌లకు ఎవరో ఒకరికి ఉండే ఎలిమినేషన్ గండం తప్పింది. దీంతో వారు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఐతే ఈ వారం మాత్రం ఈ ఇద్దరిలో ఒకరు బయటికి వెళ్లడం తప్పేలా లేదు అంటున్నారు నెటిజన్స్. ఈ ఇద్దరు చాల వారాల నుండి డేంజర్ జోన్స్‌లో ఉంటున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ ఇద్దరిపై ఎక్కువగా నెగటివ్ టాక్ వినిపిస్తోంది. 

Also read : Noel Sean reentry: బిగ్ బాస్‌లోకి నోయల్ రీ ఎంట్రీ ఇస్తున్నాడా ?

ఈ ఇద్దరిలోనూ మోనాల్‌కి ( Monal Gajjar ) అంతో ఇంతో గ్లామర్ పరంగా అభిమానులు ఉన్నారు. అలా వారి ఓట్లు పోల్ అయ్యే అవకాశాలున్నాయి. ఇక ఎటొచ్చీ అమ్మ రాజశేఖర్‌కే ( Amma Rajasekhar ) ఈసారి గండం తప్పేలా లేదని సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండవచ్చు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ వీకెండ్‌లో ఏం జరగనుందో చూడాలి మరి.

Also read : Nagarjuna in Brahmastra: బాలీవుడ్ మూవీ షూటింగ్‌కి నాగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News