Murder Movie: మర్డర్ మూవీ విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ పరువు హత్య ( Pranay murder ) తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ వాస్తవ ఘటన ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) ‘మర్డర్’ ( MURDER Movie ) సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే గతంలో ఈ చిత్రాన్ని ఆపాలంటూ.. హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత, ఆయన తండ్రి బాలస్వామి నల్లగొండ జిల్లా కోర్టులో సివిల్ పిటిషన్‌ దాఖలు చేశారు.

Last Updated : Nov 6, 2020, 02:03 PM IST
Murder Movie: మర్డర్ మూవీ విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Ram Gopal Varma's Murder Movie Case: హైదరాబాద్: తెలంగాణ మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ పరువు హత్య ( Pranay murder ) తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ వాస్తవ ఘటన ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) ‘మర్డర్’ ( MURDER Movie ) సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే గతంలో ఈ చిత్రాన్ని ఆపాలంటూ.. హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత, ఆయన తండ్రి బాలస్వామి నల్లగొండ జిల్లా కోర్టులో సివిల్ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతోపాటు ఈ సినిమాను ఆపాలంటూ నల్లగొండ కోర్టు ఆగస్టులో స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వత వర్మ హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నిర్మాత నట్టి కరుణపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. Also read: Kamal Haasan: రజనీకాంత్ మద్దతు కోరుతున్నాం..

అయితే తాజాగా శుక్రవారం హైకోర్టు ( Telangana High Court ) మర్డర్ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాలో ప్రణయ్‌, అమృత పేర్లు, ఫోటోలు, వీడియోలు వాడకూడదని షరతు విధించింది. ఇందుకు చిత్ర బృందం అంగీకరించడంతో సినిమా రిలీజ్‌కు అడ్డంకులు తొల‌గిపోయాయి. అయితే దీనిపై సంతోషం వ్యక్తంచేస్తూ.. ఆర్జీవీ ట్విట్ చేశారు. తమ మంచి ఉద్దేశాన్ని కోర్టు అర్దం చేసుకుందని.. కోర్టు ఆర్డ‌ర్ వ‌చ్చాక అన్ని విష‌యాలు వెల్లడిస్తాను.. అందరికీ థ్యాంకూ అంటూ.. రామ్ గోపాల్ వర్మ ట్విట్‌ చేశారు. 

Also read: Vijay: ఆ పార్టీతో నాకు సంబంధం లేదు: తలపతి విజయ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News