Delhi: కోవిడ్ గైడ్‌లైన్స్ ఉల్లంఘన.. రెండు మార్కెట్ల సీజ్

దేశ రాజ‌ధాని ఢిల్లీ ( Delhi ) లో క‌రోనావైర‌స్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. అక్టోబరు 28 నుంచి నిత్యం ఐదువేల నుంచి 8వేల వరకు కరోనా (Coronavirus) కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో కరోనా కట్టడి కోసం ఢిల్లీ ప్రభుత్వం పలు చర్యలను చేపట్టింది.

Last Updated : Nov 23, 2020, 07:59 AM IST
Delhi: కోవిడ్ గైడ్‌లైన్స్ ఉల్లంఘన.. రెండు మార్కెట్ల సీజ్

Two West Delhi's markets sealed: న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీ ( Delhi ) లో క‌రోనావైర‌స్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. అక్టోబరు 28 నుంచి నిత్యం ఐదువేల నుంచి 8వేల వరకు కరోనా (Coronavirus) కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో కరోనా కట్టడి కోసం ఢిల్లీ ప్రభుత్వం పలు చర్యలను చేపట్టింది. బయటకు వచ్చేటప్పుడు మాస్కును విధిగా ధరించాలని.. ముఖ్యంగా మార్కెట్లల్లో కోవిడ్ నిబంధనలను పాటించాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం సూచించారు. ఈ మేరకు మాస్కు ధరించని వారి జరిమానాను ఏకంగా 500నుంచి 2వేలకు పెంచారు. కరోనా నిబంధనలు పాటించేలా మార్కెట్‌ల ప్రతినిధులతోనూ సీఎం సమావేశమయ్యారు. ఈ క్రమంలో కరోనా గైడ్‌లైన్స్ (COVID-19 rules) పాటించని నాంగ్లోయిలోని రెండు మార్కెట్లను వారం రోజుల పాటు నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీల్ చేశారు.

ఈ మేరకు నాంగ్లోయిలోని పంజాబీ బస్తీ మార్కెట్ (Punjabi Basti Market), జనతా మార్కెట్‌ (Janta Market) ను ఆదివారం రాత్రి పశ్చిమ ఢిల్లీ (West Delhi ) జిల్లా అధికారులు సీల్ చేశారు. మార్కెట్‌లల్లో ఏమాత్రం కోవిడ్ నిబంధనలను పాటించడం లేదని.. ఈ మేరకు నవంబర్ 30 వరకు రెండు మార్కెట్లను సీల్ చేసినట్లు విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు. సోషల్ డిస్టెన్స్ పాటించకుండా, మాస్కులు లేకుండా విక్రయాలను చేపడుతున్నారని పేర్కొన్నారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటించని మార్కెట్లను మూసివేస్తామని కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. Also read: Indian Army: సరిహద్దుల్లో రహస్య సొరంగం గుర్తింపు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.

మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x