Dele Alli catch viral video: ఫుట్‌బాల్ ప్లేయర్ క్రికెట్ బాల్ క్యాచ్ పడితే ఇలా ఉంటుందా ?

ఫుట్ బాల్ ఆటగాడు క్రికెట్ ఆడి, ఫుట్ బాల్‌ని హ్యాండిల్ చేసినట్టుగానే క్రికెట్ బాల్‌ని క్యాచ్ పడితే చూడ్డానికి ఆ దృశ్యం ఎలా ఉంటుంది ? ఏంటి అర్థం కాలేదా ? అయితే మీరు ఈ దృశ్యం చూడాల్సిందే. మామూలుగా అయితే, క్రికెట్‌లో డైవ్స్ చేసి, గాల్లోకి పైకి ఎగిరి అతికష్టమైన క్యాచ్‌లు పట్టడం చూస్తుంటే వావ్.. అమేజింగ్ అనిపించకమానదు.

Last Updated : Nov 25, 2020, 06:24 AM IST
Dele Alli catch viral video: ఫుట్‌బాల్ ప్లేయర్ క్రికెట్ బాల్ క్యాచ్ పడితే ఇలా ఉంటుందా ?

ఫుట్ బాల్ ఆటగాడు క్రికెట్ ఆడి, ఫుట్ బాల్‌ని హ్యాండిల్ చేసినట్టుగానే క్రికెట్ బాల్‌ని క్యాచ్ పడితే చూడ్డానికి ఆ దృశ్యం ఎలా ఉంటుంది ? ఏంటి అర్థం కాలేదా ? అయితే మీరు ఈ దృశ్యం చూడాల్సిందే. మామూలుగా అయితే, క్రికెట్‌లో డైవ్స్ చేసి, గాల్లోకి పైకి ఎగిరి అతికష్టమైన క్యాచ్‌లు పట్టడం చూస్తుంటే వావ్.. అమేజింగ్ అనిపించకమానదు. సరిగ్గా అలాంటిదే ఇదిగో ఈ ఫుట్‌బాలర్ ఆడిన ఇండోర్ క్రికెట్ గేమ్. కాకపోతే ఈ క్యాచ్ పట్టడం కోసం ఇతడేం గాల్లోకి డైవ్ చేయలేదు. పైకి ఎగరనూ లేదు. జస్ట్ సింపుల్‌గా.. ఇంకా చెప్పాలంటే ఎప్పటిలాగే ఫట్ బాల్ ఆడినట్టు తన కాలు వాడాడు అంతే... అదెలాగో మీరే చూడండి. 

🏏⚽️😜 pic.twitter.com/Ngy3LXQLak

— Dele (@dele_official) November 23, 2020

 

 

ఇంగ్లండ్‌‌లోని టాటెన్‌‌హామ్ ఫుట్‌‌బాల్ క్లబ్ ఆటగాళ్లు ఇటీవల వార్మప్‌‌ కోసం ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌‌లో క్రికెట్ ఆడారు. ఈ ఆటలో ఒక బ్యాట్స్‌‌మన్ మిడాన్ దిశగా బంతిని హిట్ ఇవ్వగా అది తక్కువ ఎత్తులో ముందుకు దూసుకెళ్లింది. మిడాన్‌లో ఉండి ఫీల్డింగ్ చేస్తున్న డెలీ అలీ అనే ఫుట్ బాల్ ప్లేయర్ ఆ బంతిని కాలితో ఆపే ప్రయత్నం చేయగా ఆ బాల్ అతడి కాలికి తగిలి వెంటనే పైకి గాల్లోకి లేచింది. ఇంకేం ఆలస్యం చేయకుండా డెలీ ఆ బంతిని ఒడిసి పట్టుకున్నాడు. 

Also read : Paul Van Meekeran: అప్పుడు ఇంటర్నేషనల్ క్రికెటర్.. ఇప్పుడు ఫుడ్ డెలివరీ బాయ్‌

డెలీ అల్లీ బంతిని క్యాచ్ పట్టిన తీరు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఇంకేం ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.

మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి

 

Trending News