తాజాగా రానున్న కేంద్ర ఉత్తర్వుల ప్రకారం ఒకవేళ ఇంకో మూడు నెలల్లో గానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించిన సెజ్ భూముల్లో పరిశ్రమలు కార్యకలాపాలు ప్రారంభించని యెడల.. వాటికి సెజ్ స్టేటస్‌ను తొలిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే తెలంగాణలో ఖాళీగా ఉన్న 30 సెజ్ భూములు కూడా ఆ స్టేటస్ కోల్పోయే అవకాశం ఉంది. కేంద్రప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాల వద్ద ఎన్ని భూములు సెజ్‌ల పేరుతో ఉన్నాయో... అందులో ఎన్ని భూముల్లో పరిశ్రమలు స్థాపించారో తెలుసుకొనేందుకు సింఘాల్ కమిటీని వేసింది.
ఈ కమిటీ నివేదిక ఇచ్చి.. కేంద్రం దాని ప్రకారంగా ఆమోదం తెలిపితే మాత్రం, మిగతా రాష్ట్రాల్లో అత్యధిక శాతం సెజ్ భూములు ఉన్న తెలంగాణ కొత్త సమస్యలో చిక్కుకొనే అవకాశం ఉంది. సాధారణంగా సెజ్ స్టేటస్‌ను ప్రతీ మూడు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సింఘాల్ కమిటీ రికమెండేషన్ ప్రకారం ఒక సెజ్ ప్రారంభించాలంటే కేంద్ర హోంశాఖ నుండి సెక్యూరిటీ క్లియరెన్స్ కూడా తీసుకోవాలని అంటున్నారు.