GHMC Elections 2020: గ్రేటర్ ఎన్నికల కోసం కొత్త యాప్

GHMC Elections 2020: హైదరాబాద్ ఎన్నికల కోసం జీహెచ్ఎంసీ కొత్త యాప్ రూపొందించింది. పోలింగ్ బూత్ ఎక్కడుందో గూగుల్ మ్యాప్ సహాయంతో తెలుసుకోవచ్చు. మైజీహెచ్ఎంసీ యాప్ ప్రయోజనాలివీ..

Last Updated : Nov 28, 2020, 07:48 PM IST
  • గ్రేటర్ ఎన్నికల కోసం సరికొత్త యాప్ రూపొందించిన జీహెచ్ఎంసీ
  • మైజీహెచ్ఎంసీ పేరుతో యాప్..ఓటర్ స్లిప్ డౌన్లోడ్, పోలింగ్ బూత్ గూగుల్ లొకేషన్ సాధ్యం
  • యాప్ పై ప్రచారం చేస్తున్న జీహెచ్ఎంసీ
GHMC Elections 2020: గ్రేటర్ ఎన్నికల కోసం కొత్త యాప్

GHMC Elections 2020: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం జీహెచ్ఎంసీ కొత్త యాప్ రూపొందించింది. పోలింగ్ బూత్ ఎక్కడుందో గూగుల్ మ్యాప్ సహాయంతో తెలుసుకోవచ్చు. మైజీహెచ్ఎంసీ యాప్ ప్రయోజనాలివీ..

గ్రేటర్ ఎన్నికలు సమీపించాయి. రేపట్నితో ప్రచారం పరిసమాప్తం కానుంది. డిసెంబర్ 1న గ్రేటర్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఓటర్ల కోసం జీహెచ్ఎంసీ కొత్త యాప్‌ను సిద్ధం చేసింది. మైజీహెచ్ఎంసీ యాప్ ( Myghmc app )పేరుతో రూపొందిన ఈ యాప్‌తో చాలా ప్రయోజనాలున్నాయి.

జీహెచ్ఎంసీ ఎన్నిక ( GHMC Elections )ల్లో ఓటుహక్కు కలిగినవారు ఓటరు స్లిప్‌తో పాటు పోలింగ్ బూత్ ఎక్కడుందనేది అరచేతిలోని మొబైల్ సహాయంతో తెలుసుకోవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌ ( Smartphone )లోనే  పోలింగ్ బూత్ వివరాల్ని గూగుల్ మ్యాప్‌తో తెలుసుకోవచ్చు. ఇప్పటికే నగరంలోని ఓటర్లందరికీ ఓటర్ స్లిప్‌లు పంచిపెట్టింది జీహెచ్ఎంసీ. నగర ఓటర్లలో అత్యధికుల చేతిలో మొబైల్ ఫోన్ ఉండటంతో అరచేతి నుంచే సదరు ఓటర్..ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకునే విధంగా మొబైల్ యాప్ తీర్చిదిద్దారు.

ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో మైజీహెచ్ఎంసీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత యాప్ ఓపెన్ చేసి..నో యువర్ పోలింగ్ స్టేషన్ పై క్లిక్ చేసి ఓటరు పేరు, వార్డు పేరు ఎంటర్ చేస్తే...ఓటరు స్లిప్‌ ( Voter slip ) తో పాటు పోలింగ్ బూత్ ఎక్కుడుందో గూగుల్ మ్యాప్ లొకేషన్ వస్తుంది. పేరుకు బదులు ఓటరు గుర్తింపు కార్డు నెంబర్, వార్డు పేరు ఎంటర్ చేసినా ఫలితం వస్తుంది. నో యువర్ పోలింగ్ స్టేషన్ యాప్ పై ప్రచారం కల్పించేందుకు జీహెచ్ఎంసీ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది. బస్ షెల్టర్లపై ఫ్లెక్సీల రూపంలో, ఎఫ్ఎం రేడియోలో జింగిల్స్ రూపంలో, టెలివిజన్ ఛానెల్స్ లో స్క్రోలింగ్ రూపంలో ప్రచారం చేపడుతోంది. Also read: Bandi Sanjay: టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుంది: బండి సంజయ్

Trending News