కరేబియన్ దీవుల్లో భూకంపం..హైఅలర్ట్

మంగళవారం సెంట్రల్ అమెరికాలోని కరేబియన్ దీవులకు సమీపంలో హోండురస్ లో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది.

Last Updated : Jan 10, 2018, 01:45 PM IST
కరేబియన్ దీవుల్లో భూకంపం..హైఅలర్ట్

మంగళవారం సెంట్రల్ అమెరికాలోని కరేబియన్ దీవులకు సమీపంలో హోండురస్ లో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో అమెరికా వర్జిన్ దీవులు, ప్యూర్టో రికోలకు సునామీ హెచ్చరికలు జారీచేశారు. మూడు అడుగుల ఎత్తున అలలు ఎగిసిపడతాయని అమెరికా అధికారులు హెచ్చరించారు. 

భూప్రకంపనల ధాటికి హోండురస్ రాజధాని టెగుచిగల్పాలో ఇల్లు, భవనాలు నేలమట్టమయ్యాయి. దీంతో ఆ దేశ అధ్యక్షుడు జువాన్ ఓర్లాండో హైఅలర్ట్ ప్రకటించారు. భూకంపం కారణంగా ఆస్తి నష్టం సంభవించిందని.. ఎటువంటి ప్రాణనష్టం జరలేదని చెప్పారు. మెక్సికో రాష్ట్రం క్వింటానా రూలో కూడా భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. 

Trending News