DOST 2020 Registrations: ‘దోస్త్‌’ ప్రవేశాలకు లాస్ట్ ఛాన్స్.. నేటితో ముగియనున్న తుదిగడువు

Last Date For DOST 2020 Registrations: తెలంగాణ‌లోని అన్ని యూనివ‌ర్సిటీల ప‌రిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ‘దోస్త్’ (Degree Online Services, Telangana) ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీలో ప్రవేశాల కోసం విద్యార్థులకు తుది అవకాశం కల్పించినట్లు దోస్త్ (DOST) కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు.

Last Updated : Dec 17, 2020, 10:10 AM IST
  • ఆ విద్యార్థులకు శుభవార్త
  • దోస్త్‌లో మరోసారి అవకాశం
  • రిజిస్ట్రేషన్‌కు నేడు తుదిగడువు
DOST 2020 Registrations: ‘దోస్త్‌’ ప్రవేశాలకు లాస్ట్ ఛాన్స్.. నేటితో ముగియనున్న తుదిగడువు

Last Date For DOST 2020 Registrations: తెలంగాణ‌లోని అన్ని యూనివ‌ర్సిటీల ప‌రిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ‘దోస్త్’ (Degree Online Services, Telangana) ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీలో ప్రవేశాల కోసం విద్యార్థులకు తుది అవకాశం కల్పించినట్లు దోస్త్ (DOST) కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. గతంలోనే వెబ్ ఆప్షన్ల గడువు ముగియగా.. ఇప్పటివరకూ దరఖాస్తు చేసుకోని వారు సైతం రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవచ్చునని సూచించారు.

Also Read: Jobs 2020: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 510 ఉద్యోగాలు

ఇటీవల వెబ్ ఆప్షన్లు ఇచ్చుకుని అనంతరం సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోవడంతో తెలంగాణ (Telangana)లో సీటు కోల్పోయిన విద్యార్థులు సైతం తాజాగా మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. దోస్త్ (DOST)లో డిగ్రీ ప్రవేశాలకు గురువారం (డిసెంబర్ 17) చివరి అవకాశం కల్పించినట్లు వివరించారు. కరోనా కారణంగా ఈ ఏడాది నోటిఫికేషన్ ఆలస్యమైందని తెలిసిందే.

Also Read: Forbes 2020 Highest Paid Celebrities: బావను వెనక్కినెట్టి మరీ టాప్ లేపిన ముద్దుగుమ్మ!  

తొలి, రెండో విడత దోస్త్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా 1,53,547 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారు. మూడో విడతలో మరికొందరు విద్యార్థులకు అడ్మిషన్ లభించింది. అయితే దోస్త్ ద్వారా మరింత మంది విద్యార్థులకు, అవకాశం కోల్పోయిన వారికి చివరి అవకాశం ఇచ్చినట్లు దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి వివరించారు.

Also Read: Telangana Jobs 2020: నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News