ఆరు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం భారత్ వచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యహు ఇవాళ గుజరాత్ సందర్శించారు. గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమం సందర్శించి అక్కడ మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం ఆశ్రమంలోనే చరకా తిప్పి చరకా ప్రత్యేకతలు అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో బెంజమిన్ నెతన్యహు సతీమణి సారా నెతన్యహు కూడా అతడి వెన్నంటే వున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా అహ్మదాబాద్ విమానాశ్రయానికి ఎదురువెళ్లి నెతన్యహు దంపతులకు స్వాగతం పలికారు. భారత సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే రీతిలో అతిథులని అలరించేలా విమానాశ్రయంలోనే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
#WATCH PM Modi and Israel PM Netanyahu and his wife Sara Netanyahu fly a kite at Sabarmati Ashram. #NetanyahuInIndia pic.twitter.com/sN4TJBqLYp
— ANI (@ANI) January 17, 2018
Ahmedabad: PM Modi and Israel PM Netanyahu and his wife Sara Netanyahu fly a kite at Sabarmati Ashram. #NetanyahuInIndia pic.twitter.com/DQ1WnXs1Zs
— ANI (@ANI) January 17, 2018
సబర్మతి ఆశ్రమం అనంతరం బెంజమిన్ నెతన్యహు దంపతులు సరదాగా గాలిపటం ఎగరేశారు. గాలిపటం ఎలా ఎగరేసే క్రమంలో వారి వెన్నంటే వున్న ప్రధాని మోడీ.. గాలిపటం ఎలా ఎగరేయాలో చూపించారు.