Union Cabinet Meet: ఎస్సీ విద్యార్ధులకు వరాలు జల్లు..కీలక నిర్ణయాలు

Union Cabinet Meet: ఎస్సీ విద్యార్ధులకు కేంద్ర ప్రభుత్వం వరాలు కురిపించింది. దళితుల స్కాలర్‌షిప్‌ను ఏకంగా 5 రెట్లు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. మరికొన్ని కీలక నిర్ణయాల్ని ఆమోదించింది. 

Last Updated : Dec 23, 2020, 07:33 PM IST
  • కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..ఎస్సీ విద్యార్ధుల స్కాలర్ షిప్ మొత్తం 5 రెట్లు పెంపు
  • డీటీహెచ్ సేవలపై కొత్త మార్గ దర్శకాలు..20 ఏళ్లకోసం అనుమతులు
  • NFDCలో అనుబంధ విభాగాల విలీనం
Union Cabinet Meet: ఎస్సీ విద్యార్ధులకు వరాలు జల్లు..కీలక నిర్ణయాలు

Union Cabinet Meet: ఎస్సీ విద్యార్ధులకు కేంద్ర ప్రభుత్వం వరాలు కురిపించింది. దళితుల స్కాలర్‌షిప్‌ను ఏకంగా 5 రెట్లు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. మరికొన్ని కీలక నిర్ణయాల్ని ఆమోదించింది. 

దళితుల స్కాలర్‌షిప్‌ ( SC Scholorships ) ల విషయంలో కేంద్ర కేబినెట్ ( Union cabinet ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ విద్యార్ధులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ ( Post matric scholorship ) ‌లు అందించేందుకు సిద్ధమైంది. ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో స్కాలర్‌షిప్ మొత్తాన్ని 5 రెట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రానున్న ఐదేళ్లలో 4 కోట్ల ఎస్సీ విద్యార్ధులకు 59 వేల కోట్ల స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నట్టు తెలిపింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 60 శాతం అంటే 35 వేల 534 కోట్లు ఉంటుంది. మిగిలింది రాష్ట్ర ప్రభుత్వాల వాటా. 

అటు డీటీహెచ్ సేవలకు ( DTH Services ) సంబంధించి మార్గదర్శకాల్ని సవరించింది. ఇకపై 20 ఏళ్లకోసారి డీటీహెచ్ లైసెన్స్ ఉంటుందని..ప్రతి 3 నెలలకు లైసెన్స్ ఫీజు చెల్లించాలని కేబినెట్ స్పష్టం చేసింది. డీటీహెచ్ ఆపరేటర్ల మధ్య మౌళిక సదుపాయాల షేరింగ్‌కు అనుమతిచ్చింది. 

నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌లో పలు విభాగాల్ని విలీనం చేయడాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. NFDCలో ఫిల్మ్ డివిజన్, డైరెక్టరరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్, నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా, చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీలు విలీనం చేయనున్నారు. 

మరోవైపు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ( PM Kisan samman nidhi ) తదుపరి వాయిదా నిధుల్ని మోదీ డిసెంబర్ 25న విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద 9 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. 

Also read: PM Kisan Samman Nidhi: రైతులకు తీపి కబురు.. 25న జమకానున్న కేంద్ర సాయం

Trending News