PF Balance Check: మీ ఖాతాల్లోకి వడ్డీ జమ.. పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి

EPFO PF Balance Check: 2019-20 ఏడాదికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాలలో జమచేయనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.

Written by - Shankar Dukanam | Last Updated : Dec 31, 2020, 05:09 PM IST
  • ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
  • 2019-20 ఏడాదికి సంబంధించిన వడ్డీ ఈపీఎఫ్ ఖాతాల్లో జమ
  • నాలుగు రకాలుగా మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు
PF Balance Check: మీ ఖాతాల్లోకి వడ్డీ జమ.. పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి

EPFO PF Balance Check: ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 2019-20 ఏడాదికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాలలో జమచేయనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. దీంతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(EPFO), కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ ఖాతాదారులకు నూతన సంవత్సర కానుక అందించనున్నారు. 

 

మొత్తం 8.5శాతం వడ్డీని తొలుత రెండు దఫాలుగా ఈపీఎఫ్ ఖాతాదారులకు అందించాలని నిర్ణయించారు. అయితే దీపావళి సమయంలో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఒకేసారి ఈపీఎఫ్ ఖాతాల్లో మొత్తం వడ్డీని జమ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఏ క్షణంలోనైనా ఈపీఎఫ్ఓ(EPFO) పీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ కానుంది. ఈపీఎఫ్ ఖాతాదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. పీఎఫ్ బ్యాలెన్స్‌ను నాలుగు విధాలుగా చెక్ చేసుకోవచ్చు. ఆ వివరాలు మీకోసం

Also Read : ​Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!

 

ఆన్‌లైన్‌లో EPF Balance
తొలుత http://epfindia.gov.in/ వెబ్‌సైట్‌ ఓపెన్ చేయాలి.
అందులో మీ యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి
ఈ పాస్‌బుక్ మీద క్లిక్ చేయండి
అక్కడ మీ వివరాలు నమోదు చేసిన తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది
మెంబర్ ఐడీ వివరాలు సబ్మిట్ చేస్తే ఈపీఎఫ్ బ్యాలెన్స్(PF Balance) వివరాలు కనిపిస్తాయి

Also Read: EPFO: పీఎఫ్ నగదు విత్‌డ్రా చేస్తున్నారా.. ఈ తప్పులు అసలు చేయవద్దు!

 

ఎస్ఎంఎస్..
మీ పీఎఫ్ అకౌంట్, బ్యాంక్ ఖాతాలకు ఒకే నెంబర్ ఉండి.. ఆ నెంబర్‌ను ఈపీఎఫ్ఓలో అప్‌డేట్ చేసి ఉంటే మీ మొబైల్ నెంబర్‌కు తరచుగా పీఎఫ్ వివరాలు అందుతుంటాయి. లేకపోతే EPFOHO UAN అని టైప్ చేసి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి 7738299899కు మెస్సేజ్ చేయాలి. దాంతో మీ నెంబర్‌కు పీఎఫ్ వివరాలు అందుతాయి.

Also Read : PF Balance Missed Call Number: పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా తెలుసుకోవచ్చు.. ఒక్క మిస్డ్ కాల్ చాలు

 

మిస్డ్ కాల్ ద్వారా..
ఈపీఎఫ్ఓ ఖాతాదారులు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ద్వారా ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు ఫోన్‌కు వస్తాయి. యూఏఎన్ నెంబర్‌తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ నుంచి 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఈపీఎఫ్ వివరాలు వెంటనే మీ రిజిస్టర్ మొబైల్‌కు పంపిస్తారు.

Also Read : Lower Interest Rates On Home Loans: హోమ్ లోన్ తీసుకునే వారికి శుభవార్త.. అతి తక్కువ వడ్డీకే రుణాలు

 

UMANG Appలోనూ చెక్ చేసుకోవచ్చు
మొదట UMANG App ఓపెన్ చేయండి
తర్వాత ఈపీఎఫ్ఓ మీద క్లిక్ చేయండి
Employee Centric Services మీద క్లిక్ చేయాలి
View Passbook ఆప్షన్‌ను క్లిక్ చేయండి
మీ UAN నెంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి
మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది
ఇప్పుడు మీరు ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు

 Also Read: Salary Reduce from 2021: వచ్చే ఏడాది మీ జీతం తగ్గవచ్చు.. ఎందుకో తెలుసా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News