Deepika Padukone: అవి మొత్తం డిలీట్ చేసిన దీపికా పదుకొనె

Deepika Padukone: బాలీవుడ్ నటి దీపికా పదుకొనె నూతన సంవత్సరం తొలిరోజే తన అభిమానులతో పాటు నెటిజన్లకు సైతం షాకిచ్చింది. ఏమైందో తెలియదు కానీ ఉన్నట్టుండి.. ఇప్పటివరకూ తాను చేసిన అన్ని ఫొటో, వీడియో, టెక్ట్స్ పోస్టులను డిలీట్ చేసింది.

Last Updated : Jan 1, 2021, 08:06 PM IST
  • నూతన సంవత్సరం తొలిరోజే తన అభిమానులకు నటి షాక్
  • సోషల్ మీడియా మొత్తం ఖాళీ చేసిన హీరోయిన్ దీపికా పదుకొనె
  • తాజాగా కొత్త విధానం మొదలుపెట్టిన బాలీవుడ్ ముద్దుగుమ్మ
Deepika Padukone: అవి మొత్తం డిలీట్ చేసిన దీపికా పదుకొనె

Actress Deepika Padukone: బాలీవుడ్ నటి దీపికా పదుకొనె నూతన సంవత్సరం తొలిరోజే తన అభిమానులతో పాటు నెటిజన్లకు సైతం షాకిచ్చింది. ఏమైందో తెలియదు కానీ ఉన్నట్టుండి.. ఇప్పటివరకూ తాను చేసిన అన్ని ఫొటో, వీడియో, టెక్ట్స్ పోస్టులను డిలీట్ చేసింది దీపిక. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో దీపికా పదుకొనె ట్వీట్లు, పోస్టులు కనిపించకపోవడంతో ఫాలోయర్లు తొలుత కంగారు పడ్డారు. 

న్యూ ఇయర్ తొలిరోజు తమ అభిమాన నటి దీపికా పదుకొనె(Deepika Padukone) సోషల్ మీడియా ఖాతాలు ఏమైనా హ్యాక్ అయ్యాయా అని అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే వాయిస్ పోస్టులు మొదలుపెట్టింది బాలీవుడ్ బ్యూటీ. వాయిస్ పోస్టులతో నెటిజన్లకు, తన ఫాలోయర్లకు తాను చెప్పాలనుకున్నది సూటిగా స్పష్టంగా చెప్పవచ్చు అని భావించింది దీపికా పదుకొనె.

Gallery: Aathmika Photos: నటి ఆత్మిక అందాలకు నెటిజన్లు ఫిదా

 

 

కాగా, నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు భర్త రణవీర్ సింగ్‌తో కలిసి ఇటీవల జైపూర్‌కు వెళ్లింది. అక్కడే మరో బాలీవుడ్(Bollywood) జంట రణ్‌బీర్ కపూర్, అలియా భట్ సైతం కొత్త ఏడాదికి వెల్‌కమ్ చెప్పింది. దీపికా పదుకొనెను ట్విట్టర్‌లో 27 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 52.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. నేడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ తన సోషల్ మీడియా ఖాతాల్లో నటి దీపిక వాయిస్ పోస్ట్ షేర్ చేసింది.

Gallery: Iswarya Menon Photos: అందాల ‘ఐశ్వర్య’మా.. పరువాల పావురమా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News