10 ఏళ్ల బాలుడు.. ఐన్‌స్టీన్‌ను దాటేశాడు..!!

బ్రిటన్‌లో ఉంటున్న ఒక భారత సంతతి కుర్రాడు.. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్ స్టీన్ ఐక్యూను దాటేశాడు. 

Last Updated : Jan 27, 2018, 12:15 PM IST
10 ఏళ్ల బాలుడు.. ఐన్‌స్టీన్‌ను దాటేశాడు..!!

బ్రిటన్‌లో ఉంటున్న ఒక భారత సంతతి కుర్రాడు.. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ ఐక్యూను దాటేశాడు. గత పదేళ్లలో ఆ రికార్డును అందుకున్న అత్యంత పిన్నవయస్కుడిగా మెహుల్ గార్గ్ రికార్డు సృష్టించాడు. ఆ బాలుడు మెన్సా ఐక్యూ టెస్టులో అత్యధికంగా స్కోరు చేసి.. ఆల్బర్ట్ ఐన్ స్టీన్, స్టీఫెన్ హాకింగ్‌లను కూడా వెనక్కి నెట్టేశాడు. దక్షిణ ఇంగ్లాండ్‌‌లోని రీడింగ్ బాయ్స్ గ్రామర్ స్కూల్‌లో గార్గ్ చువుతున్నాడు. ఐక్యూ పరీక్షలో ఆ బాలుడు 162 స్కోరు చేశాడు. ఈ స్కోరు ఐన్ స్టీన్, స్టీఫెన్ హాకింగ్ ఐక్యూ స్కోరు కన్నా రెండు పాయింట్లు ఎక్కువ. 

ఈ బాలుడు రూబిక్ క్యూబ్‌ను కేవలం వంద సెకన్లలో పూర్తిచేశాడు. ఛానల్ 4 నిర్వహించే చైల్డ్ జీనియస్ 2018 షోలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు. అంతేకాదు మెహుల్ అన్నయ్య కూడా గతేడాది మెన్సా ఐక్యూ టెస్టులో 162 పాయింట్లు స్కోరు చేయడం విశేషం..!!

Trending News