Shivamogga blast live Updates: కర్ణాటకలోని శివమొగ్గ సమీపంలో చోటుచేసుకున్న క్వారీ పేలుడులో ( Shivamogga quarry blast) ఇప్పటివరకు 9 మంది మృతదేహాలు వెలికితీసినట్టు శివమొగ్గ పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారిలో ఆరుగురు బిహార్‌కి చెందిన వలస కూలీలే ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. క్వారీ పేలుడు ఘటనలో క్వారీ ఓనర్, డైనమైట్స్ సరఫరాదారుడిని అరెస్ట్ చేసినట్టు కర్ణాటక రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. క్వారీ పేలుడు తీవ్రతను పరిశీలిస్తే.. అక్కడ భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు నిల్వచేసినట్టు తెలుస్తోందని, నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు అర్థమవుతోందని బసవరాజ్ ( Karnataka Home Minister Basavaraj Bommai ) పేర్కొన్నారు.
Fire accident in serum factory: సీరమ్ ఇనిస్టిట్యూట్ లో భారీ అగ్నిప్రమాదం
శివమొగ్గ క్వారీ పేలుడు ( Shivamogga ) గురించి కర్ణాటక మైనింగ్ శాఖ మంత్రి మురుగేష్ రుద్రప్ప నిరాని మాట్లాడుతూ.. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఆరుగురు బిహార్ వాసులు ఉన్నారని.. మొత్తం మృతుల సంఖ్య ఇంకా తెలియాల్సి ఉందని అన్నారు. శివమొగ్గ-హనగల్ స్టేట్ హైవేకు సమీపంలోని అబ్బలగిరిలో గురువారం రాత్రి 10.30 గంటలకు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Karnataka's Shivamogga blast: శివమొగ్గ క్వారీ పేలుడులో 9 మంది మృతదేహాలు లభ్యం