ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న తరుణంలో ఆర్థిక శాఖ సహాయమంత్రి శివ్ ప్రతాప్ శుక్లా మీడియాతో మాట్లాడారు. ఈ బడ్జెట్‌ను సామాన్యులకు లాభదాయకమైన బడ్జెట్‌గా ప్రకటించవచ్చని తెలిపారు.
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ ఉదయం 11 గంటలకు పార్లమెంటులో 2018-19 సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అయితే ఇది అత్యంత కఠినతరమైన బడ్జెట్ అని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. వ్యవసాయ లక్ష్యాలను నెరవేర్చడంతో పాటు వ్యవసాయ సంక్షోభం, ఉపాధి అవకాశాల పెంపుదల మరియు ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసే సవాళ్ళను జైట్లీ పరిష్కరించాల్సి ఉంటుంది. రానున్న నెలల్లో ఎనిమిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అందులో మూడు ప్రధాన రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వమే ఉంది. అలాగే తదుపరి సంవత్సరం సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ బడ్జెట్ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ వ్యాసం కూడా చదవండి: కేంద్ర బడ్జెట్ 2018 వెనుకున్న ఆర్థిక నిపుణుడి గురించి నాలుగు ముక్కల్లో..
ఈ బడ్జెట్లో ఎంఎన్ఆర్ఇజిఎ, గ్రామీణ గృహ పథకాలు, నీటిపారుదల ప్రాజెక్టులు, పంట బీమాలు మొదలైన వాటికి కూడా కేటాయింపులు జరగవచ్చని వార్తలు వస్తున్నాయి.
కొత్త గ్రామీణ పథకాలు బడ్జెట్లో వస్తే, అప్పుడు ఎంఎన్ఆర్ఇజిఎ, గ్రామీణ గృహాలు, నీటిపారుదల ప్రాజెక్టులు, పంట భీమా వంటి కార్యక్రమాల కోసం కూడా కేటాయింపులను చూడవచ్చు. గ్రామీణ ఓటు బ్యాంకును కొల్లగొట్టే అభిప్రాయం ఉంటేజజ జైట్లీ తన బడ్జెట్లో వ్యవసాయ రంగం మరింత ప్రోత్సాహకాలను అందించవచ్చు. అదే విధంగా ఈ బడ్జెట్లో చిన్న తరహా పరిశ్రమలకు కూడా రాయితీలు ప్రకటించవచ్చు.
ఈ వ్యాసం కూడా చదవండి: జైట్లీ 'ఎన్నికల' బడ్జెట్లో ఈ అంశాలే ఉండబోతున్నాయ్..!
అదే సమయంలో, ఉద్యోగులకు ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని విస్తరించే ప్రయత్నం కూడా బడ్జెట్లో చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అలాగే రహదారులు వంటి నిర్మాణ ప్రాజెక్టులతో పాటు, రైల్వేల ఆధునికీకరణను మరింత సొమ్ము కేటాయించే అవకాశం కూడా ఈ బడ్జెట్లో ఉంది. అయితే అదే సమయంలో, జైట్లీకి బడ్జెట్ లోటును తగ్గించడానికి ఏం చేస్తారన్నది ఆయన వద్ద ఉన్న మరో కఠినమైన సవాలు.
It will be a good budget. It will be for the benefit of the common people: Shiv Pratap Shukla, MoS, Finance #UnionBudget2018 #Delhi pic.twitter.com/HAjqTT2PxR
— ANI (@ANI) February 1, 2018